స్ధల పురాణం

స్ధల పురాణం

కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని ‘భవిష్యోత్తర పురాణం’లోని ఓ కథనం వుంది. తిరుమల వేంకటేశ్వరుని ‘శ్రీనివాసుడు, బాలాజీ’ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటగా.. వైఖానస అర్చకుడు శ్రీమాన్ గోపీనాథ దీక్షితులవారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి) స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో వున్న శ్రీవారి మూర్తిని కనుగొని... ప్రస్తుతమున్న ప్రదేశంలో దాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల వంశీయులే పరంపరగా స్వామివారి పూజా కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నారు.

స్థల పురాణం :

ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువను దర్శించుకోవడం కోసం వాయు దేవుడు వైకుంఠానికి చేరుకుంటాడు. అదే సమయంలో వాయుదేవుడిని ఆదిశేషువు అడ్డగించి, విష్ణువు మహాలక్ష్మితోపాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అయినప్పటికీ తాను లోనికి ప్రవేశించేందుకు వాయుదేవుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆదిశేషువుకు, వాయుదేవుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. వారిమధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో విష్ణువు అక్కడికి చేరుకోగా.. ఆయన్ను చూసి వారిద్దరూ తమతమ గొప్పతనం చెప్పుకొంటారు.

అప్పుడు మేధోమథనంలో పడిపోయిన మహావిష్ణువు వారికి ఓ పరీక్ష పెడతాడు. మేరు పర్వతం ఉత్తరభాగంలో వున్న ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి పట్టుకొమని ఆదిశేషుని చెబుతాడు. అలాగే.. అతడు పట్టిన ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని వాయుదేవుడికి పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొంటుంది. దీంతో చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల అక్కడికి చేరుకుంటాడు. వారు పరీక్ష నుంచి విరమించుకోమని ఆదిశేషువును కోరగా... అతడు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు.

దాని ఫలితంగా ఆనందపర్వతం వాయువుదేవుని ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకున్న ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ.. ఆదిశేషువుని బుజ్జగిస్తాడు. ‘వేంకటాద్రితో విలీనం చేస్తాను.. అక్కడ మహావిష్ణువు వెలస్తాడు’ అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగభాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు. శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

  Sthala puranam
Bus station  
Rate This Article
(4 votes)
Tags : tirumala sri venkateswara swamy temple information  

Other Articles

 • Sthala puranam

  Nov 18 | శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాష లో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి... Read more

 • Air port

  Mar 15 | విమాన మార్గం తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.... Read more

 • Railway station

  Mar 15 | రైలు మార్గం తిరుమలకు దగ్గరిలోని రైల్వే స్టేషనున్న తిరుపతికి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషన్ నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు,... Read more

 • Bus station

  Mar 15 | దేశంలోని అన్నిప్రాంతాల నుండి తిరుపతికి వెళ్లేందుకు అనువైన రోడ్డు మార్గం కలదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆర్.టి.సి బస్సు సౌకర్యం కలదు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో భక్తులకు అనువుగా వుండేందుకు ప్రభుత్వాలు మరిన్ని... Read more

 • Dharhan times

  Mar 15 | సర్వదర్శనం : సాధారణ రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడం కోసం 18 గంటలవరకు సమయం కేటాయిస్తారు. రద్దీ ఎక్కువగా వున్న రోజుల్లో 20 గంటలకు పెంచుతారు. స్పెషల్ దర్శనం : ఈ ఆలయంలో స్పెషల్ దర్శనం... Read more