jr ntr romance with rakul preet singh in london busy roads | jr ntr sukumar movie

Jr ntr romance with rakul preet singh in london busy roads

jr ntr, rakul preet singh, ntr with rakul preet, sukumar, ntr sukumar movie, london busy roads, ntr romance, rakul preet singh romance

jr ntr romance with rakul preet singh in london busy roads : Jr ntr and sukumar combo movie shooting running in london busy roads.

లండన్ వీధుల్లో ఎన్టీఆర్ రొమాన్స్..

Posted: 07/15/2015 12:36 PM IST
Jr ntr romance with rakul preet singh in london busy roads

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమా సినిమాకి తనలోని ప్రత్యేక వేరియేషన్స్ ని ప్రేక్షకజనాలకు పరిచయం చేసి ఆదరణ పొందుతున్న ఎనర్జటిక్ హీరో. తన నటనతో, డ్యాన్సింగ్ తో, స్టైలిష్ తో తెలుగురాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆమధ్యలో వరుసగా ఫ్లాపులు వచ్చినప్పటికీ.. ఈ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు ‘టెంపర్’ సినిమాయే ఎగ్జాంపుల్. ఆ చిత్రం అఖండ విజయం నమోదు చేసుకుని ఎన్టీఆర్ ఇమేజ్ ఏంటో నిరూపించింది. ఇక నేటివిటికి అనుగుణంగా ఈ హీరో కూడా సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ‘నాన్నికి ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలనలో వున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే అతని సరికొత్త లుక్స్ ఇంటర్నెట్ లో తెగ హల్ చేస్తున్నాయి. గతంలో మునుపెన్నడూ ఏ హీరో కనిపించని సరికొత్త గెటప్ లో ఎన్టీఆర్ కనిపించి.. తన చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించాడు. ఇక ఈ చిత్రం విషయానికొస్తే.. ఈ మూవీ షూటింగ్ లండన్ లో గతకొన్ని రోజుల నుంచి జరుగుతోంది. ప్రస్తుతం ఆ సినిమాలోని తన ప్రేయసి రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి ఎన్టీఆర్ రొమాన్స్ చేస్తున్నాడు. అంటే.. వీరిమధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతోపాటు లండన్ వీధుల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం నృత్య సారథ్యంలో ఈ పాటను ఎన్టీఆర్, రకుల్ జంటపై లండన్ బిజీ రోడ్లపై షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ నెల 20వ తేదీన వరకు ఈ షూటింగ్ అక్కడే కొనసాగుతుంది.

ఇదిలావుండగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే.. షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లుగా చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్స్ అందరినీ కట్టిపడేస్తాయని.. సినిమా కథ కూడా చాలా కొత్తగా సాగుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  rakul preet singh  london  sukumar  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more