Rajendra Prasad Bags Father Role To Ntr | Nannaku Prematho Movie | director sukumar

Rajendra prasad bags father role to ntr in nannaku prematho movie

rajendra prasad, nannaki prematho movie, director sukumar, junior ntr, tollywood natakiriti, rajendra prasad news, rajendra prasad updates, rajendra prasad gossips, rajendra prasad photos, rajendra prasad ntr news, rajendra prasad photo shoot

Rajendra Prasad Bags Father Role To Ntr In Nannaku Prematho Movie : According to the film industry news natakiriti rajendra prasad bags father role in nannaku prematho movie to junior ntr which is directed by sukumar.

ఎన్టీఆర్ ప్రేమను రాజేంద్రప్రసాద్ తండ్రిగా స్వీకరిస్తారా?

Posted: 06/20/2015 03:37 PM IST
Rajendra prasad bags father role to ntr in nannaku prematho movie

ఒకప్పుడు తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు రాజేంద్రప్రసాద్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్నపాత్రలను పోషిస్తున్నారు. ఒక తండ్రిగా, శాడిస్టుగా, విలన్ గా, కన్నింగ్.. ఇలా రకరకాల పాత్రల్లో నటిస్తున్నారు. ఆయా పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఈయన్ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆ తరహాలోనే ఇప్పుడు మరో అరుదైన ఆఫర్ రాజేంద్రప్రసాద్ కు వరించిందని వార్తలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రంలో అతనికి తండ్రిగా నటించే ఆఫర్ రాజేంద్రప్రసాద్ కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి ‘నాన్నకి ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ టైటిల్ ను బట్టి చూస్తుంటే.. తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపట్టే విధంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఈ సినిమాలో ఏ విధంగా హీరో పాత్రకు ప్రాధాన్యత వుంటుందో అదేవిధంగా కథానాయకుడి తండ్రి పాత్ర కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే.. సినిమాకే ఎంతో ముఖ్యమైన ఆ తండ్రి పాత్రకి పూర్తి న్యాయం చేయగలిగే యాక్టర్ ఎవరా? అని దర్శకనిర్మాతలు పరిశీలించగా.. చివరగా రాజేంద్రప్రసాద్ ను ఎంచుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

సన్నివేశాలకు తగ్గట్టు సహజత్వంతో కూడిన బలాన్ని రాజేంద్రప్రసాద్ అందిస్తాడనే ఉద్దేశంతో ఆయన్ని ఎంపిక చేసుకున్నారని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు. దాదాపు ఆయనే ఖరారైనట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆయన ఎన్టీఆర్ కి తండ్రిగా ఎంపిక అయినట్లుగా ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  Nannaki prematho  junior ntr  sukumar  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more