‘విక్రమార్కుడు’ సినిమాలో డబుల్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించిన హీరో మాస్ మహారాజ రవితేజ... ఇప్పుడు మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఇంతకీ ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా.. 2009లో వచ్చి ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన కిక్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘కిక్ 2′ లో రవితేజ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.
‘కిక్’ సినిమాలోని రవితేజ–ఇలియానాల వారసుడి చుట్టూ ‘కిక్-2’ సినిమా కథ తిరుగుతుందని.. ‘తండ్రి – కొడుకులుగా’ రెండు విభిన్న పాత్రల్లో రవి కనిపించనున్నాడని యూనిట్ సభ్యులు తెలుపుతున్నారు. అందులో కొడుకు పాత్ర కోసం మాస్ మహారాజా తన లుక్ మార్చుకొని చాలా స్లిమ్ అండ్ స్టైలిష్ గా తయారయ్యాడు. అలాగే తండ్రి పాత్ర కోసం కూడా తన లుక్ ని చాలా మార్చుకున్నాడని సమాచారం. తండ్రి కొడుకుల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఇందులో ఉన్నాయి. ఆన్ స్క్రీన్ పై ఒకేసారి ఇద్దరు రవితేజలు రెండు డిఫరెంట్ లుక్స్ లో చూసి ఆడియన్స్ ని థ్రిల్ అవుతారని ఈ చిత్ర టీం అంటోంది.
ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more