తమ్ముడు-అన్నయ్య, హీరో-విలన్, కొడుకు-భర్త, తండ్రి-తాత... ఇలా ఎన్నోరకాల వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు నటుడు ప్రకాష్ రాజ్! దక్షిణాది ఇండస్ట్రీలో మరే నటుడు ఈయనలాగా వుండరేమోనన్న విధంగా తన మార్క్ ముద్రించేసుకున్నారు. ఈ ఇమేజే ఆయన్ను మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు తెచ్చిపెడుతోంది. అంతేకాదు.. నిర్మాత, దర్శకత్వ రంగాల్లోనూ ఈయన తనను తాను పరీక్షించుకున్నారు కానీ.. అందులో అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. అయితే.. నటుడిగా ఈయనకున్న ఇమేజ్ ని ఆ పరాజయాలు ఈయన సినీకెరీర్ ఏమాత్రం అడ్డుపడలేదు. ఇప్పటికీ బోలెడన్నీ సినిమాలతో ఫుల్ బిజీగా కాలం గడుపుతున్నారు.
ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో చాలా సినిమాలతో బిజీగా వున్న ప్రకాష్.. ఇప్పుడో కొత్త ప్రయోగానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం! ఈయన స్టేజి మీద ఎక్కి.. ఓ నాటకంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ రాసిన ‘మంత్రపుష్పం’ అనే కన్నడ నాటకంలోనే ప్రకాష్ రాజ్ ఓ ముఖ్యపాత్రను పోషించనున్నాడు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు కూడా! శృంగారం, భక్తి రెండూ మిళితమైన ఈ కథలో కీలకమైన పూజారి పాత్రను తాను పోషిస్తున్నట్లుగా తెలిపాడు. ఇటువంటి పాత్రలో నటించేందుకు అవకాశం కల్పించిన వారికి తాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ప్రకాష్ పేర్కొన్నాడు.
ప్రతిరోజూ తాను చేసే కమర్షియల్ పాత్రలు, సినిమాల నడుమ ఈ నాటకం పాత్ర తనకు సేద తీరుస్తుందని ప్రకాష్ తన అభిప్రాయం వెల్లడించాడు. అప్పుడప్పుడు ఇలాంటి నాటకాల్లో నటిస్తేనే నటుడిగా తృప్తి లభిస్తుందని ఆయన అన్నారు. ఈ నాటకానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more