balakrishna special speech on senior ntr | Lion Audio release function

Nandamuri balakrishna lion movie audio release function speech senior ntr style

balakrishna news, balakrishna lion movie, balakrishna lion audio release, lion audio release, balakrishna movie updates, balakrishna 100 movie, balakrishna updates, trisha krishnan, radhika apte, senior ntr news, senior ntr photos, balakrishna speech, balakrishna ntr speech

nandamuri balakrishna lion movie audio release function speech senior ntr style : In Lion Audio function nandamuri balakrishna has given speech about his father style which he puts in his every movie.

‘అది నాన్నగారు వారసత్వంగా ఇచ్చారు’

Posted: 04/10/2015 12:49 PM IST
Nandamuri balakrishna lion movie audio release function speech senior ntr style

సీనియర్ ఎన్టీఆర్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో టాప్ స్థానంలో దూసుకుపోతున్నారు. ‘సింహా’ సినిమాలో సరికొత్త డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులకు తన చరిష్మా ప్రదర్శించిన బాలయ్య.. ‘లెజెండ్’ సినిమాతో 50 కోట్ల క్లబ్ లోకి చేరి రికార్డు సృష్టించారు. ఐదుపదుల వయస్సుకు దగ్గరపడుతున్నప్పటికీ నేటి యువహీరోలకు ధీటుగానే కొత్త స్టైలిష్ లుక్స్ తో కనువిందు చేస్తున్నారు. అయితే.. ఈ కొత్తదనాన్ని తనకు ప్రసాదించింది తన తండ్రి ఎన్టీఆర్ అని, ఆయనిచ్చిన ఆ వరంవల్లే తాను నటించే సినిమాలన్నింటిలో కొత్తదనం వుంటుందని తాజాగా ఆయన చెప్పిన స్పీచ్ అందరినీ ఆకర్షించింది.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా కొత్త దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ‘లయన్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు అందించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 9న శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో సీడీని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేసారు. ఈ వేడుకలో బాబుతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే బాలయ్య తన స్టైల్ డైలాగులతో, మ్యానరిజంతో ఇచ్చిన స్పీచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. భారీ డైలాగులు, మధ్యమధ్యలో తెలుగు పద్యాలు, చలోక్తులు విసిరి ఆద్యాంతం స్పీచ్‌ను రక్తికట్టించారు.

ఈ క్రమంలోనే బాలయ్య మాట్లాడుతూ.. “మీరు ప్రతిసారీ కొత్తదనమున్న సినిమాలనే ఎలా తీస్తారు? కొత్తవారిని వెండితెరకు పరిచయం చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? అని చాలా మంది అడుగుతారు. మా నాన్న నందమూరి తారక రామారావు నాకు వారసత్వంగా ఇచ్చిందే కొత్తదనాన్ని! ఇక నా సినిమాలో కొత్తదనం లేకుండా ఎలా ఉంటుందీ?” అంటూ బాలకృష్ణ తన స్టైల్లో స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ విన్న అనంతరం అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలావుండగా.. ఏప్రిల్ 30న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna NTR  Lion Movie udpates  Trisha Krishnan  Radhika Apte  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more