మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన డైనమిక్ హీరో వరుణ్ తేజ్.. తన మొదటి సినిమా ‘ముకుందా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే! ఆ మూవీ యావరేజ్ హిట్ అయినప్పటికీ.. వరుణ్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు! ఆ తర్వాత తన తదుపరి సినిమా కోసం ఈ హీరోకి కాస్త నిరీక్షణ చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ హీరో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి వుండేది. కానీ పూరీ ప్రస్తుతం రెండుమూడు సినిమాలతో బిజీగా వుండడంతో వీరిద్దరి కాంబోలో రూపొందాల్సిన మూవీ పోస్ట్ పోన్ అయ్యింది.
ఈ నేపథ్యంలోనే వరుణ్ ఇప్పుడు తాజాగా ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విలక్షణ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే ‘కంచె’ అన్న టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే! ఫిబ్రవరి 27వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైద్రాబాద్‌లో జరిగింది. ఈ షూటింగ్ క్రమంలోనే సినిమా కోసం నిర్మించిన ఓ భారీ సెట్‌లో చిత్రీకరణ జరిగింది. ఆ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ జరుగుతోంది. తాటిపాక పరిసర ప్రాంతాల్లో కొంత షూటింగ్ జరుపుకుతున్న ఈ మూవీ ఇప్పుడు తాజాగా పదిహేను రోజుల పాటు నర్సాపురంలో షూటింగ్ జరగపుకోనుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్ మొదలైంది కూడా! త్వరగా ఈ మూవీ షూటింగ్ ని ముగించుకుని, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
‘ముకుందా’తో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన వరుణ్.. తన తదుపరి సినిమాతో ప్రేక్షకులకు ‘కంచె’ వేస్తాడో లేదో తెలుసుకోవాలంటే మరికొన్నాళ్లపాటు ఆగాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more