Junior ntr next movie with director vv vinayak after sukumar

junior ntr news, junior ntr latest news, junior ntr photos, junior ntr gallery, junior ntr movies, junior ntr movie gossips, junior ntr vinayak movie, junior ntr sukumar movie, junior ntr vakkantham vamsi movie

junior ntr next movie with director vv vinayak after sukumar : According to the tollywood sources.. Junior ntr may do another movie with director vv vinayak after sukumar and vakkantham vamsi project.

జూనియర్ ఎన్టీఆర్

Posted: 03/17/2015 04:33 PM IST
Junior ntr next movie with director vv vinayak after sukumar

ఇటీవలే ‘టెంపర్’ సినిమాతో మంచి విజయం సాధించడంతోపాటు సమాజానికి ఓ మంచి మెసేజ్ అందించాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో చాలాకాలం నుంచి తాను నిరీక్షిస్తున్న విజయం ఎట్టకేలకే ఈ సినిమాతో తీరిపోయింది. ఈ నేపథ్యంలోనే తాను తీయబోయే చిత్రాలన్నీ ప్రయోగాత్మకంగానూ, సరికొత్తగానూ, ప్రేక్షకులకు కనువిందుగానూ వుండేవిధంగా ఈ యంగ్ టైగర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తన దగ్గరకు వస్తున్న వరుస ఆఫర్లను ఒప్పుకోకుండా, తన సక్సెస్ కు తోడయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సుకుమార్ వంటి డైరెక్టర్ తో కలిసి సరికొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయం తీసుకున్నాడు ఎన్టీఆర్! నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి వుంది కానీ.. కొన్ని కారణాల వల్ల కాస్త వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని ఆ మూవీ యూనిట్ వెల్లడించింది.

ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ‘టెంపర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ చేసేందుకు ఓకే అన్నాడని ప్రచారం జరుగుతోంది. వంశీ చెప్పిన కథ కాస్త వెరైటీగా వుండటంతో అతనితో మూవీ చేసేందుకు యంగ్ టైగర్ పచ్చజెండా ఊపినట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఇదిలావుండగా.. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ క్రమంలోనే వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఆసక్తి చూపుతున్నాడని సన్నిహిత వర్గాలంటున్నాయి. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్ అటు సుకుమార్, వంశీతో కమిట్ కాగా, వినాయక్ అఖిల్ తో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వారివారి సినిమాలు పూర్తయిన తర్వాత ఇద్దరు కలవనున్నారని అంటున్నారు. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  sukumar  vv vinayak  vakkantham vamsi  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more