Trivikram srinivas megastar chiranjeevi 150 movie gossips

trivikram srinivas, chiranjeevi, tollywood gossips, telugu news, puri jagannath, ram charan, allu aravind, vv vinayak, son of satyamurthy, tollywood news

trivikram srinivas megastar chiranjeevi 150 movie gossips : The rumours going viral in tollywood that Trivikram srinivas may direct chiranjeevi's 150 film.

త్రివిక్రమ్ శ్రీనివాస్

Posted: 03/13/2015 07:14 PM IST
Trivikram srinivas megastar chiranjeevi 150 movie gossips

తెలుగు చిత్రపరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్! రైటర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కలంతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. అనంతరం అనతికాలంలోనే దర్శకునిగా అవతారమెత్తారు. యువతనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే తరహాలో మంచి సినిమాలను తెరకెక్కించి తిరుగులేని డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే!

ఇదిలావుండగా.. ప్రస్తుతం టాలీవుడ్ లో త్రివిక్రమ్ తదుపరి చిత్రానికి సంబంధించి ఓ ప్రచారం కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి ఈయనే దర్శకుడిగా ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇటీవలే చిరు ఓ కథను ఎంపిక చేసుకుని దానిపై వర్క్ కొనసాగిస్తున్నారు. ఈ మూవీని పూరీ జగన్నాథ్ లేదా వివి వినాయక్ ఇద్దరిలో ఎవరో ఒకరికి దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని మొన్నిటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘సన్నాఫ్...’ మూవీ షూటింగ్ పూర్తికాగానే చిరంజీవి చిత్రంపై వర్క్ చేస్తారని అంటున్నారు.

ఫ్యామిలీ, యువతను ఆకట్టుకునేలా చిత్రాన్ని తీయడంలో శ్రీనివాస్ దిట్ట కాబట్టి.. ఈయనే చిరు 150 చిత్రానికి సరైన దర్శకుడని మెగా క్యాంపు భావించిందట! ఈ నేపథ్యంలోనే ఆయనతో చర్చలు జరిపేందుకు మెగాకుటుంబం సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trivikram srinivas  son of satyamurthy  chiranjeevi 150 film  mega family members  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more