Telugu hero commedian sunil bangalore days movie important role offer

telugu hero sunil, telugu comedian sunil, sunil latest news, sunil bangalore days movie, telugu hero sunil bangalore days, bangalore days remake movie, samantha latest news, hero sunil movies, hero sunil samantha movie, telugu news, bangalore days movie updates

telugu hero commedian sunil bangalore days movie important role offer : tollywood comedian turned actor got an important role offer in bangalore days movie which is to be directed by bommarillu bhaskar and produced by pvp.

బ్యాడ్ పోయి బెంగళూర్ డేస్ వచ్చాయా?

Posted: 01/13/2015 12:48 PM IST
Telugu hero commedian sunil bangalore days movie important role offer

కమెడియన్’గా ఇండస్ట్రీలో ఓ ఊపేఊపేసిన నటుడు సునీల్.. తర్వాత హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే! హీరోగా తీసిన మొదటి చిత్రంతో ఫ్యామిలీ సక్సెస్ అందుకున్న ఈ నటుడు.. తర్వాత రాజమౌళి డైరెక్షన్’లో ‘మర్యాదరామన్న’ చిత్రంలో నటించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక దాంతో ఇతనికి తిరుగులేకుండా పోయింది. వరుసగా ఒకదాని మీద ఒకటి ఆఫర్లు వచ్చాయి. అందులో ‘పూలరంగడు’ కూడా మంచి విజయాన్ని అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘మిస్టర్ పెళ్లికొడుకు’, ‘భీమవరం బుల్లోడు’ చిత్రాలు ఫ్లాప్’గా నిలిచాయి. దీంతో సునీల్’కి ఆటంకాలు ఎదురయ్యాయి.

ఒకేసారి రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మళ్లీ సునీల్’కి ఎటువంటి అవకాశాలు దక్కలేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా.. చివరికి చిన్న సినిమా ప్రొడ్యూసర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో దాదాపు ఏడాదికిపైగా సునీల్ ఖాళీగానే సమయం గడపాల్సి వచ్చింది. ఎంతో సాఫీగా సాగుతున్న కెరీర్ ఒక్కసారిగా బ్యాడ్’గా మారిపోయింది. అయితే.. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే సునీల్ జీవితంలో మళ్లీ ఆ మంచి రోజులు తిరిగొచ్చాయనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ నటుడు మళ్లీ తెరమీద తన నటనతో హాస్యం పండించే రోజులు దగ్గరలోనే వున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మలయాళంలో విజయం సాధించిన ‘బెంగళూర్ డేస్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ రీమేక్ చిత్రంలో సిద్ధార్థ, సమంత మెయిన్ రోల్స్ పోషిస్తుండగా.. ఇందులో వున్న మరొక కీలకపాత్ర కోసం హీరో సునీల్’ని సంప్రదించినట్లు సమాచారం! ఆ పాత్ర మూవీలో ఎంతో కీలకమైందని.. ఆ పాత్రతోనే స్టోరీలో కొన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇక తమిళ వెర్షన్’లో ఇదే పాత్రకు ‘జిగార్తాండ’ ఫేం బాబీ సింహాను సంప్రదించారట! అయితే.. వారిద్దరి నుంచి ఇంకా ఎటువంటి సమాధానం అందలేదని, వాళ్ల అభిప్రాయాల మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి వుందని సమాచారం!

ప్రస్తుతం ఏ మూవీలు లేక ఖాళీగా వున్న సునీల్.. తెలుగు వెర్షన్’లో ఈ పాత్రను ఓకే చేసే అవకాశాలు చాలావరకు వున్నాయి. పైగా అది చాలా కీలకమైంది కాబట్టి.. అది అతని కెరీర్’కి తోడ్పడవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్సెస్ చాలావరకు వున్నాయని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’ బాస్క దర్శకత్వం వహిస్తుండగా.. పీవీపీ నిర్మిస్తున్నారు. మార్చి 1వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. మరి.. సునీల్ ఆ పాత్రలో నటించేందుకు ఓకే అంటాడో..? లేదో..? వేడి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil bangalore days  telugu comedians  tollywood news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more