Mahesh babu in aagadu movie promotions

mahesh babu, tollywood movies, mahesh babu tollywood, mahesh babu aagadu movies, mahesh babu movie theatres, mahesh babu news, mahesh babu gallery, aagadu movie news, aagadu movie gallery

tollywood prince mahesh babu in aagadu movie promotions

మహేష్ బాబు

Posted: 09/16/2014 04:30 PM IST
Mahesh babu in aagadu movie promotions

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏవిధంగా వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయకున్న ఈ ఫాలోయింగ్ ని దృష్టి పెట్టుకునే నిర్మాతలు ఎంతటి భారీ బడ్జెట్ తో నైనా ఇతనితో సినిమాలు తీయడానికి ముందుకు వస్తుంటారు. ఒకవేళ ఇతని సినిమా ఫ్లాపయినా... సదరు సినిమాకు చేసిన ఖర్చు రిలీజైన రెండు, మూడురోజుల్లోనే వసూలవుతాయి. అంతగా ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్నాడు ఈ రాజకుమారుడు! అలాగే ఇతని ఇమేజ్ ను క్యాచ్ చేసుకోవడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు మహేష్ కి కొన్ని కోట్లు సమర్పించుకుని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటున్నారు. అంటే.. ఒకవైపు సినిమాలతోపాటు మరోవైపు అడ్వర్టయిజ్ మెంట్లలో దూసుకుపోతున్నాడు.

ఇదిలావుండగా.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రానురాను మల్టీప్లక్సుల సంఖ్య పెరిగిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఎంక్యూబ్ ఏషియన్ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ఒకటి సిద్ధమవుతోంది. అత్తాపూర్ లో వున్న ఈ మల్టీప్లెక్స్.. మొదటినుంచే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. తన మార్కెటింగ్ స్థాయిని ఒక్కసారిగా పబ్లిసిటీ చేసుకునే ఆలోచనతో వున్న ఆ మల్టీ ప్లెక్స్ నిర్వాహకులు... ప్రిన్స్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలాగో మహేష్ ‘‘ఆగడు’’ చిత్రం 19వ తేదీన రిలీజ్ కాబోతోంద కనుక... అతని చేతుల మీదే గ్రాండ్ గా ఓపెనింగ్ చేయించి.. ఆ సినిమాను తమ థియేటర్ లో ప్రదర్శించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మల్టీప్లెక్స్ పబ్లిసిటీ భారీగానే జరుగుతుంది... సినిమా వసూళ్లు బాగానే వస్తాయి. మరోవైపు మహేష్ సినిమాకు లభించాల్సిన ప్రచారం కూడా లభిస్తుంది.. అతనికి రావాల్సిన పారితోషికం కూడా వచ్చేస్తుంది.

శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థవారు భారీగా ఖర్చుపెట్టి నిర్మించిన విషయం తెలిసిందే! అలాగే ప్రమోషన్ లో భాగంగా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ తోపాటు సెన్సార్ కార్యక్రమాన్ని కూడా ముగించుకున్న ఈ సినిమాకు ‘‘యూ/ఏ’’ సర్టిఫికెట్ దక్కింది. ఈ మూవీపై నిర్మాతలతోపాటు మహేష్ బాబు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని దక్కించుకుంటుందో సెప్టెంబర్ 19వరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more