Interview actress asmitha

Asmitha, Biography, Asmitha Photos, Movie Stills, Fan Club, Latest News, Asmitha Wallpapers, Videos, Photo Gallery, Filmography

your favorite actress Asmitha. All this happening only ... tv serials in Etv.Padmayuham serial Gouri is.information about Asmitha including upcoming movies, biography, filmography, Asmitha photos, videos, wallpapers, movie releases. Join Asmitha fan club watch trailers, upload photos, videos and read the latest news.

actress Asmitha.GIF

Posted: 03/14/2012 12:05 PM IST
Interview actress asmitha

interview-actress_Asmitha

Asmithaపద్మాల్లాంటి కళ్లతో ‘పద్మవ్యూహం’ సీరియల్లో అద్భుతంగా నటించిన ఆమెకు ఇల్లాళ్లంతా అభిమానులయ్యారు. ‘పంజరం’లో నలిగిపోయే పాత్రలో అమాయకంగా కన్నీళ్లు పెట్టుకుంటే, అభిమానులంతా తల్లడిల్లిపోయారు. తన సహజసిద్ధమైన నటనతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపడేస్తున్న ఆ నటి... అస్మిత. ప్రస్తుతం ఆకాశగంగ, చంద్రముఖి సీరియల్స్ ద్వారా అలరిస్తోన్న ఆమె  ఆంధ్రవిశేష్ తో చెప్పిన ముచ్చట్లు....

మీ బ్యాగ్రౌండ్?

బేసిగ్గా మాది మార్వాడీల కుటుంబం. మా తాతగారు వాళ్లు వ్యాపారరీత్యా కలకత్తా వచ్చారు. నేను అక్కడే పుట్టాను. అయితే నా చిన్నప్పుడే మేం హైదరాబాద్ వచ్చి సెటిలైపోయాం.

నటన మీద ఆసక్తి ఎలా కలిగింది?

ఎందుకో చిన్నప్పట్నుంచీ మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఫొటోలకు రకరకాలుగా ఫోజులిచ్చేదాన్ని. ఇంట్లోవాళ్లందరినీ అనుకరిస్తూ ఉండేదాన్ని. కానీ మా ఇంట్లోవాళ్లకి అస్సలు ఇష్టముండేది కాదు.

మరి ఎలా ఒప్పించారు?

డిగ్రీ చేస్తున్నప్పడు ఓ జీన్స్ కంపెనీ యాడ్‌లో అవకాశం వస్తే మావాళ్లు ఒప్పుకోలేదు. తర్వాత లోకల్‌గా జరిగిన ఓ మోడలింగ్ పోటీలో గెలిచాను. అప్పుడు ఒప్పుకున్నారు. యాడ్స్ చేస్తున్నప్పుడు దూరదర్శన్‌లో ‘మనుషులు మమతలు’ సీరియల్‌లో అవకాశం వచ్చింది. దాని క్కూడా ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారు.

మొదటిసారి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు...?

ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. యాడ్స్‌ లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతాం. కానీ సీరియల్ అలా కాదు. నన్ను నేను స్క్రీన్‌మీద చూసుకోవాలన్న కల తీరిన ఆ రోజును నా జీవితంలో మర్చిపోలేను.

ఇంతవరకూ చేసినవాటిలో బాగా నచ్చిన పాత్ర?

సీతామాలక్ష్మి, పంజరం, మేఘసందేశం, ముద్దుబిడ్డ, తూర్పు పడమర... ఇలా ఒక్కో సీరియల్ ఒక్కో గుర్తింపు నిచ్చింది. కానీ ‘పద్మ వ్యూహం’లో గౌరి పాత్ర తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఓసారి ఆ సీరియల్ రచయిత ఓ అనాథాశ్రమానికి వెళ్తే, అక్కడి పిల్లలంతా ఒక్కసారి గౌరిని తీసుకురండి అని బతిమాలారట!

సినిమాల్లో కూడా నటించారుగా?

అవును. మనుషులు-మమతలు చేస్తున్నప్పుడు ‘మురారి’లో అవకాశం వచ్చింది. తర్వాత లవ్‌టుడే, అప్పుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్‌భార్య... ఇలా కొన్ని చేశాను. అయితే ఇవన్నీ ఎవరో తెలిసినవాళ్లు అడగడంతో చేసినవే తప్ప నాకు సినిమాలపై ఆసక్తి లేదు. అందుకే మొదట్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను.

ఓ నటిగా మీకు తృప్తినిచ్చేదేంటి?

ప్రేక్షకుల స్పందన, వారు చూపించే అభిమానం. ఓసారి మేం షూటింగ్ కోసం ఓ చిన్న ఊరికి వెళ్లాం. చాలామంది ఆడాళ్లు, పిల్లలు వచ్చి చుట్టుముట్టేశారు. దాంతో ఓ ముసలావిడ నన్ను తన చిన్న గుడిసెలోకి తీసుకెళ్లింది. చాలా మర్యాదలు చేసి, రెస్ట్ తీసుకోమ్మా అని బయటికి వెళ్లిపోయింది. బాగా అలసిపోవడంతో నిద్రపోయాను. లేచి బయటికి వెళ్లేసరికి ఆ ఇంటి సభ్యులంతా అరుగుమీద పడుకుని నిద్రపోతున్నారు. నాకోసం వాళ్లలా చేసేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతకంటే ఏం కావాలి!

పరిశ్రమలో మీకు నచ్చేది/నచ్చనిది?

కెమెరా ముందు నటించడమే నాకు చాలా నచ్చే విషయం. అది నా కల కదా! ఇక నచ్చనిదంటే టైమింగ్స్. పొద్దుట్నుంచి సాయంత్రం వరకూ పనిచేయాలి. ఒక్కోసారి చాలా అలసిపోతాం. దాంతో కొన్నిసార్లు పనిమీద ఆసక్తి తగ్గిపోతుంది.

మీ ప్లస్, మైనస్ పాయింట్స్?

నేను పడుచుగా బాగుంటాను, ముసలి పాత్రలోనూ బాగుంటాను. అలాగే నాకు మోడ్రన్ దుస్తులు నప్పుతాయి, సంప్రదాయ దుస్తులూ బాగుంటాయి. అంతేకాదు, నా కళ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటాయి. ఇవి నా ప్లస్ పాయింట్లు. ఇక మైనస్ అంటే నా హైట్. నా పొడవుకు సరిపోయే హీరో దొరకడం ఒక్కోసారి కష్టమవుతుంది.

ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుంది?

(నవ్వుతూ) ప్రతి సీరియల్లోనూ ఏడ్చీ ఏడ్చీ విసుగొచ్చేసింది. అందుకే ఈసారి ఏడిపించే పాత్ర చేయాలనుంది. అంటే నెగిటివ్ రోల్ అన్నమాట. అలాగే మతిస్థిమితం లేని అమ్మాయిగా కూడా చేయాలనుంది.

పుట్టినరోజు             : సెప్టెంబర్ 29
నచ్చే రంగులు          : నలుపు, గులాబి, నీలం
నచ్చిన సినిమాలు      : అందాజ్ అప్నా అప్నా, జిందగీ న మిలేగీ దొబారా
నచ్చే నటులు           : అక్షయ్ కుమార్, పరేష్ రావెల్
నచ్చే నటీమణులు      : కిరణ్ ఖేర్, కత్రినా కైఫ్
ఇండస్ట్రీలో బెస్ట్‌ఫ్రెండ్స్    : నీరజ, రమ్య, లక్ష్మి (స్రవంతి ఫేమ్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Character artist sammeta gandhi
Tv serial actress medha interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more