Shikhar Dhawan injured ‘‘దెబ్బ తగిలినా.. మన స్పందన మన చేతుల్లోనే’’

We fall we break but then we rise shikhar dhawan on his injury

Syed Mushtaq Ali, T20 tournament, Delhi beat Maharashtra, Shikhar Dhawan, Super League match, Nitish Rana, sports news, cricket, sports, cricket, sports

Opener Shikhar Dhawan's lean patch continued but Delhi still managed to register a comfortable 77-run win over Maharashtra in their opening Super League match of the Syed Mushtaq Ali Trophy T20 tournament here on Thursday.

‘‘దెబ్బ తగిలినా.. మన స్పందన మన చేతుల్లోనే’’

Posted: 11/21/2019 10:24 PM IST
We fall we break but then we rise shikhar dhawan on his injury

టీమిండియాలో గబ్బర్ సింగ్ గా పేరుగాంచిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు గాయమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ పోటీల్లో ఆడుతున్న ధావన్ మోకాలికి దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయం కారణంగా మోకాలు నుంచి రక్తం కారుతున్నా గబ్బర్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ తన ట్రేడ్ మార్క్ చూపిస్తూ హుషారుగా తొడగొట్టాడు. అంతేకాదు, ఆసుపత్రి సిబ్బందితో ఫొటోలు కూడా దిగాడు. ఏ ఫొటోలోనూ ముఖంపై చిరునవ్వు చెదరనివ్వలేదు.

ఈ ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన ధావన్ "మనం పడుతుంటాం లేస్తుంటాం, కొన్నిసార్లు దెబ్బతింటాం, మళ్లీ కోలుకుంటాం. అయితే, వివిధ పరిస్థితులపై ఎలా స్పందిస్తామన్న విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సానుకూల దృక్పథంతో హ్యాపీ ఉంటాను. మరో నాలుగైదు రోజుల్లో మైదానంలో అడుగుపెడతాను" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా గబ్బర్ అభిమానుల షేర్లు, కామెంట్లతో నెట్టింట్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh