‘‘Aah yes You sledge right’’ Australian PM asked Pant పంత్.. నువ్వే కదూ స్లెడ్జింగ్ చేశావ్ అసీస్ ప్రధాని

Aah yes you sledge right australian prime minister asked rishabh pant

Rishabh Pant, sledge, Scott Morrison, Time Paine, INDvsAUS, Babysitter, sports, Cricket, sports news, latest sports news, cricket news, cricket

Rishabh Pant won many hearts with his picture ‘babysitting’ Aussie skipper Tim Paine’s kids and the Indian keeper is now again winning the Internet with a new video of him going viral.

పంత్.. నువ్వే కదూ స్లెడ్జింగ్ చేశావ్ అసీస్ ప్రధాని

Posted: 01/02/2019 08:20 PM IST
Aah yes you sledge right australian prime minister asked rishabh pant

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ కు న్యూఇయర్ రోజున అనూహ్య సంఘటన ఎదురైంది. ‘నువ్వు స్లెడ్జింగ్‌ చేశావు కదా!’ అని సాక్షాత్తూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ అతడిని ప్రశ్నించాడు. దీంతో ఏం చెప్పాలో తెలియని పంత్.. మర్యాద పూర్వకంగా చిరునవ్వును బదులుగా ఇచ్చాడు. అసీస్ పర్యటనలో వున్న టీమిండియా.. న్యూఇయర్ వేడుకలను కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంది.

కాగా, జనవరి 1ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ గృహంలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా జట్లను ఈ వేడుకకు ఆహ్వానించారు. ఆసీస్‌ ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. టీమిండియా ఆటగాళ్లు చక్కని దుస్తులు ధరించి అక్కడికి వెళ్లారు. ప్రధాని మోరిసన్‌ ప్రతి ఒక్కరికీ కరచాలనం ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. రిషభ్‌ పంత్‌ రాగానే టీమిండియా సహాయక బృందలో ఒకరు ‘అతడు రిషభ్‌ పంత్‌’ అని ప్రధానికి పరిచయం చేశారు.

అంతే స్కాట్ మోరిసన్.. ‘ఓహ్‌.. అసీస్ కెప్టెన్ టీమ్ ఫైన్ ను నువ్వు స్లెడ్జింగ్‌ చేశావు కదా!’ అని అన్నారు. వెంటనే ‘ఆటల్లో పోటీ తత్వాన్ని మేం ఇష్టపడతాం’ అని పేర్కొన్నారు. దీంతో రిషభ్‌ పంత్‌ మర్యాదపూర్వకంగా చిరునవ్వు చిందించాడు. ఇదే కార్యక్రమంలో టిమ్‌పైన్‌ కుమారుడిని రిషభ్‌ పంత్‌ ఎత్తుకొని ముద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పైన్‌ సతీమణి ‘ఉత్తమ బేబీ సిట్టర్‌’ అని కాప్షన్‌ ఇచ్చి ఆ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో పైన్‌, పంత్‌ పరస్పరం స్లెడ్జింగ్‌ చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishabh Pant  sledge  Scott Morrison  Time Paine  INDvsAUS  Babysitter  sports  Cricket  

Other Articles