Pujara, Agarwal take India to 303/4 సిడ్నీ టెస్టు: తొలిరోజు టీమిండియా అధిపత్యం..

India vs australia 4th test pujara agarwal take india to 303 4 on day 1

Cheteshwar Pujara, Hanuma vihari, Virat Kohli, Mayank Agarwal, KL Rahul, Ajinkya Rahane, india vs australia, sydney test, cricket, cricket, cricket news, sports news, latest sports news, sports

India 303/4 at stumps on Day 1 (Pujara 130*, Vihari 39* Agarwal 77; Hazlewood 2/51). It's been India's day, led by centurion Cheteshwar Pujara and another great opening knock by Mayank Agarwal after Virat Kohli won the toss and opted to bat.

సిడ్నీ టెస్టు: తొలిరోజు టీమిండియా అధిపత్యం.. పూజారా శతకం..

Posted: 01/03/2019 05:54 PM IST
India vs australia 4th test pujara agarwal take india to 303 4 on day 1

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గవ టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలిరోజు ఆటలో పూర్తి అదిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది. చతేశ్వర్‌ పుజారా(130 బ్యాటింగ్‌; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39 బ్యాటింగ్‌; 58 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.

ఇవాళ ఆరంభమైన చివరిదైన నాల్గవ టెస్టులో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌లు ప్రారంభించగా, ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌(9) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో చతేశ్వర్‌ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు మయాంక్‌. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్‌ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్ గా పెవిలియన్‌ చేరాడు.

అనంతరం పుజారాతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమం‍లోనే పుజారా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే టీబ్రేక్‌ తర్వాత విరాట్‌ కోహ్లి(23)  ఔట్‌ కావడంతో భారత్‌ 180 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన రహానే పుజారాతో కలిసి 48 పరుగుల్ని జత చేసిన 18 వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద పెవిలీయన్ చేరాడు.

తన అరంగ్రేట టెస్టులో విఫలమైన ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారితో పూజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చక్కగా అడుతూ క్రమం తప్పిన బంతులను బౌండరీలకు మలిచారు. ఆ క్రమంలోనే పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 18వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడోది. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ రెండు వికెట్లు సాధించగా, స్టార్క్‌, లయన్ లకు తలో వికెట్‌ దక్కింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles