MS Dhoni dropped from T20 squad ఎంఎస్ ధోని టీ20 అధ్యాయం ముగిసిందా.?

Is the end of mahendra singh dhoni era upon us

MS Dhoni, India cricket, Twenty20 Internationals, India vs West Indies, Australia vs India, cricket, sports, sports news, latest sports news, latest newsMS Dhoni, India cricket, Twenty20 Internationals, India vs West Indies, Australia vs India, cricket, sports, sports news, latest sports news, latest news

MS Dhoni's fans were given a rude shock as Board of Control for Cricket in India's (BCCI) acting secretary Amitabh Chaudhary announced India's T20I squads for West Indies and Australia series.

టీ 20ల నుంచి ధోని ఔట్.. అధ్యాయం ముగిసిందా.?

Posted: 10/27/2018 03:29 PM IST
Is the end of mahendra singh dhoni era upon us

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టీ20 కెరీర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టెస్టు నుంచి తప్పుకున్న ఆయన ఇక క్రమంగా పరిమిత ఓవర్ల నుంచి కూడా తప్పించేందుకు బిసిసిఐ పూనుకుంటుందా.? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. పరిమిత ఓవర్లలో ఆయన అంతగా రాణించకపోయినా.. వరల్డ్ కప్ వరకు ఆయన జట్టులో కొనసాగుతారని ఇప్పటికే పలు సందర్భాలలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టీమిండియా జట్టుకు ధోని అవసరం ఎంతో వుందని గుర్తించిన బిసిసిఐ.. విరాట్ కోహ్లీ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని అతన్ని జట్టులో కొనసాగిస్తూ వస్తుంది. అయితే తాజాగా ధోనికి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం చేసి. టీ 20 జట్టు నుంచి కూడా తప్పించనున్నారా..? అందుకు అనుగూణంగా చర్యలు తీసుకుంటున్నారా..? అంటే అవునన్న సంకేతాలే కనబడుతున్నాయి. విండీస్, ఆస్ట్రేలియా జట్లతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించిన సెలక్టర్లు అందులో ధోనీకి చోటివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. విండీస్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌తోపాటు ఆసీస్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించింది. అలాగే, న్యూజిలాండ్-ఎ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు కోసం కూడా జట్టును ప్రటించారు. ఓపెనర్ మురళీ విజయ్, రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌లకు జట్టులో స్థానం కల్పించిన సెలక్టర్లు టీ20 సిరీస్‌లకు ధోనీని పక్కనపెట్టారు.

దీంతో ఇక ధోనీని ఒక్క వన్డేలకే పరిమితం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆసియాకప్‌కు దూరమైన కోహ్లీ విండీస్‌తో జరిగే టీ20 సిరీస్ కూ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ధోనీని ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందిస్తూ రెండు టీ20 సిరీస్ లలోనూ  ధోనీ ఆడబోవడం లేదన్నాడు. అంతమాత్రాన అతడి కెరీర్ ముగిసిందని భావించాల్సిన పనిలేదన్నాడు. రెండో వికెట్ కీపర్ ను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles