Kedar Jadhav included for fourth and fifth ODIs కేదర్ జాదవ్ కు టీమిండియా జట్టులో స్థానం

Kedar jadhav included for the last two windies odis

Kedar Jadhav, middle order batsman, MS Dhoni, India cricket, fourth and fifth odi, India vs West Indies, Australia vs India, cricket, sports, sports news, latest sports news, latest news

Kedar Jadhav, India's middle-order batsman, has been drafted into the squad for the fourth and fifth One-Day Internationals (ODIs) against Windies after the Indian selectors were satisfied with his fitness

విండీస్ తో ఆ రెండు వన్డేలకు కేదర్ జాదవ్

Posted: 10/27/2018 04:12 PM IST
Kedar jadhav included for the last two windies odis

అతిత్య జట్టు విండీస్ తో జరగనున్న చివరి రెండు వన్డేలలో మరో మార్పు చోటుచేసుకుంది. అనూహ్యంగా ఈ మార్పును బిసిసిఐ తన ట్వట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వెస్టిండీస్ తో జరగనున్న చివరి రెండు వన్డేలకు జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్ మన్‌ కేదార్‌ జాదవ్ కు చోటు దక్కింది. విశాఖ వన్డే అనంతరం చివరి మూడు మ్యాచులకు సెలక్షన్‌ కమిటీ గురువారం ప్రకటించిన జట్టులో జాదవ్‌ పేరు లేని విషయం తెలిసిందే.

దీనిపై జాదవ్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ ‘ఫిట్‌నెస్‌ కారణంగా తనను పక్కన పెట్టినట్లు గతంలో ప్రకటించిన సెలక్షన్‌ కమిటీ, తాను ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత కూడా ఎందుకు చోటు కల్పించలేదో తెలియడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు దీనిపై తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటూ వాపోయాడు జాదవ్. దీనిపై తొలుత పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరిన చీఫ్ సెలక్డర్ ఎమ్మెస్కే ప్రపాద్ కేదార్ జాదవ్ ను కోరాడు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు.

అనూహ్యంగా కేదార్ జాదవ్ కు టీమిండియా జట్టులో స్థానం కల్పించారు. చివరి రెండు వన్డేల్లో జాదవ్‌కు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ‘కేదార్‌ జాదవ్‌ తరచూ గాయపడతాడన్న కారణంగానే అతనిని మూడో వన్డేకు ఎంపిక చేయలేదు. గతంలోనూ ఒకటి రెండుసార్లు అతను జట్టులోకి రావడం, వెంటనే గాయపడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అతనికి అవకాశం ఇవ్వలేదు’ అన్నది చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట. చివరికి జాదవ్‌ విమర్శలకు దిగివచ్చారో, మరో కారణం ఉందో కానీ, చివరి రెండు వన్డేలకు జట్టులో జాదవ్‌కు స్థానం కల్పించి అతనికి ఊరటనిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kedar Jadhav  India cricket  Odi matches  India vs West Indies  cricket  sports  

Other Articles