Statistical preview of the 3rd ODI in Pune ఫూణేలో మూడో వన్డే.. విజయంపై అంచనాలు..

India vs west indies statistical preview of the 3rd odi in pune

India vs windies, Prithvi Shaw, Mohammad Shami, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, ODIs, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Although West Indies brought the game down to the wire, they would be disappointed that they couldn’t beat India on Wednesday. They will have another go in Mumbai and will be going all guns blazing in the third ODI.

అధిపత్యం కోసం భారత్.. గెలుపుపై కసితో విండీస్..

Posted: 10/26/2018 07:10 PM IST
India vs west indies statistical preview of the 3rd odi in pune

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-విండీస్ మధ్య జరగనున్న మూడో వన్డేలో భారత్ అధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా, విండీస్ గెలుపుకోసం పట్టుదలతో వుంది. పూణేలో జరుగుతున్న మూడో వన్డేను తమ ఖాతాలో వేసుకుని విండీస్ పై అధిపత్యం ప్రదర్శించాలని టీమిండియా వ్యూహాలు రచిన్తుండగా, గెలుపు అంచుల వరకు చేరి.. విజయాన్ని అస్వాదించ లేకపోయిన విండీస్.. తమ ఖాతాలో తొలి విజయాన్ని వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.

తొలి వన్డేను గెలుచుకున్న భారత్.. విశాఖలో జరిగిన రెండో వన్డేను డ్రాతో సరిపెట్టింది. దీంతో మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. రెండో వన్డే డ్రా గా ముగియడంతో కసితో రగిలిపో్యింది. దీంతో రేపటి వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పర్యాటక జట్టు భావిస్తోంది. ఇక చివరి మూడు వన్డేలకు పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు అందుబాటులోకి రావడంతో భారత బౌలింగ్ మరింత బలోపేతం అయింది.

ముఖ్యంగా తొలి పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వీరు ఆటను ప్రభావితం చేయగలరని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. వచ్చే ఏడాది ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టును ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడేది ఇంకా 16 మ్యాచులే కాబట్టి అప్పటికి మిడిలార్డర్‌లో నిలకడ లేమిని సరిచేయడంతోపాటు, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలని యోచిస్తోంది. శనివారం నాటి మ్యాచ్‌లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles