కోహ్లీ సేన ఖాతాలో బెంగళూరు టెస్టు.. తోకముడిచిన అసీస్.. ashwin six wicket haul help India win bangalore test

Bangalore test ashwin takes six wickets as india beat australia by 75 runs

rohit sharma, india vs australia, virat kohli, ajinkya rahane, india australia bengaluru test, m chinnaswamy stadium, Ravichandran Ashwin, Steve Smith, hazelwood, Australia cricket, India Cricket cricket, cricket news, latest sports news, sports, cricket news, cricket

Ravichandran Ashwin took 6-41 and Australia lost its last six wickets for 11 runs as India rebounded to win the second test by 75 runs to level the four-match series at 1-1.

బెంగళూరు టెస్టు మనదే.. రెండో ఇన్నింగ్స్ లో తోకముడిచిన అసీస్..

Posted: 03/07/2017 04:59 PM IST
Bangalore test ashwin takes six wickets as india beat australia by 75 runs

విరాట్ సేన విజృంభించింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో మళ్లీ పాత కథే అన్నట్లుగా సాగినా.. ఫిల్డింగ్ లో మాత్రం పోరాటపటిమతో రాణించి కేవలం నాలుగు గంటల వ్యవధితో అసీస్ ను కంగారెత్తించింది. దీంతో టీమిండియా అసీస్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని మరీ  విజయ ఢంకా మోగించింది. ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే కుప్పకూల్చి తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది.

బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టులో అసీస్ బ్యాట్స్ మెన్లు విరాట్ సేన బౌలర్లను ఎదర్కోలేకపోయారు. నాల్గవ రోజు లంచ్ విరామ సమయానికి అలౌట్ అయిన టీమిండియా.. ఫీల్డింగ్ చేయగా, 188 పరుగులు విజయలక్ష్యాన్ని చేధించడంలో భాగంగా అసీస్ బ్యాట్సమెన్లు బరిలోకి దిగారు. అది నుంచే తడబాటుకు గురైన అసీస్ బ్యాట్స్ మెన్లు..భారత బౌలర్ల ధాటికి కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే చాపచుట్టేశారు. ప్రధానంగా స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లతో సత్తా చాటి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతనికి ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లతో చక్కటి సహకారం అందించాడు. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.

ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్(28) దే అత్యధిక స్కోరు కాగా, హ్యాండ్ స్కాంబ్(24), వార్నర్(17), మిచెల్ మార్ష్(13)లే ఆపై రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. అంతకుముందు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 213/4.. పటిష్టంగా కనిపించిన టీమిండియా.. నాల్గవ రోజు లంచ్ విరామానికి అసీస్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. నాల్గవ రోజు కేవలం 61 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయి బోక్కబోర్లాపడింది. పలితంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అస్ట్రేలియాకు ఎదుట 188 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.

నాల్గవ రోజు భారత్ కనీసం మరో 100 పరుగుల అధిక్యాన్ని నమోదు చేసి.. ఆ తరువాత అసీస్ ను కంగారెత్తిస్తారని ఆశించిన భారత క్రికెట్ అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. విరాట్ సేన మాత్రం తమ చెత్త ప్రదర్శనను కొనసాగించి భారత అభిమానుల ఆశల్ని నీరుగార్చారు. వరుస వికెట్లు చేజార్చుకుని మరోసారి ఆసీస్ కు తలవంచారు. చివరి ఆరు వికెట్లను 36 పరుగుల వ్యవధిలో కోల్పోయి కంగారుల బౌలింగ్ కు బెంబేలెత్తిపోయారు. హజల్ వుడ్ మొత్తంగా రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో రాణించడం విరాట్ సేన నడ్డివిరిచింది.

భారత్ స్కోరు 238 పరుగుల వద్ద రహానే(52) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో క్రీజ్ లోకి వచ్చిన కరుణ నాయర్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ స్టార్క్ బౌలింగ్ లో నాయర్ వచ్చే రావడంతోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత  పూజారా(92), అశ్విన్(4)లను మూడు బంతుల వ్యవధిలో హజల్ వుడ్ అవుట్ చేసి భారత్ కు షాకిచ్చాడు. కాగా, హజల్ వుడ్ వేసిన తరువాత ఓవర్ లో ఉమేశ్ యాదవ్(1)అవుట్ కావడంతో భారత్ 258 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ ను కోల్పోయింది. చివర్లో సాహా(20 నాటౌట్)తో కలిసి ఇషాంత్ శర్మ (6) కాసేపు ఆసీస్ బౌలింగ్ ను ప్రతిఘటించారు.  చివరి వికెట్ గా ఇషాంత్ అవుట్ కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగింసింది. ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్ ఆరు వికెట్లతో రాణించగా, స్టార్క్ , ఓకీఫ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravichandran Ashwin  kl rahul  pujara  ajinkya rahane  india  australia  bangalore  cricket  

Other Articles

Today on Telugu Wishesh