రవిశాస్త్రీ ఉత్తమ కెప్టెన్ల జాబితాపై సౌరవ్ గంగూలీ.. sourav ganguly on ravi shastri's best captains list

Sourav ganguly attacks ravi shastri again says maybe he never saw me lead the team

Sourav Ganguly, Ravi Shashtri, ganguly on ravi shastri, ganguly vs shastri, ravi shastri in sourav ganguly, sourav ganguly comments, anil kumble, india vs australia, ind vs aus, Captain, Test, cricket news, sports news, cricket

Former Indian captains Sourav Ganguly said that may be Ravi Shastri excluded him from the list of India’s top captains because he never saw him play.

రవిశాస్త్రీ ఉత్తమ కెప్టెన్ల జాబితాపై సౌరవ్ గంగూలీ..

Posted: 03/07/2017 05:51 PM IST
Sourav ganguly attacks ravi shastri again says maybe he never saw me lead the team

భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో తనను చేర్చకపోవడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కాస్త ఆలస్యంగా స్పందించాడు. తన కెప్టెన్సీ సమయంలో రవిశాస్త్రి క్రికెట్ చూడకపోవడం ఒక కారణం కావచ్చంటూ గంగూలీ చురకలంటించాడు. 'నేను భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో రవిశాస్త్రి క్రికెట్ చూడలేదేమో. కనీసం ఒక మ్యాచ్ ను కూడా చూసి ఉండడు. అందుకే రవిశాస్త్రి అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో నాకు చోటు దక్కలేదు' అని గంగూలీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఈ ఏడాది జనవరిలో రవిశాస్త్రి విడుదల చేసిన టీమిండియా గ్రేట్ కెప్టెన్ల జాబితాలో గంగూలీకి స్థానం ఇవ్వలేదు. దాంతో పాటు గంగూలీ పేరుతో పాటు నడిచే దాదా హోదాను మరో భారత కెప్టెన్ కు కట్టబెట్టేశాడు రవిశాస్త్రి . గత కొన్ని రోజుల క్రిత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి దాదా అనే పదాన్ని తగిలించాడు. 'దాదా కెప్టెన్'  ధోని అంటూ కితాబిచ్చాడు. 'ఎంఎస్ ధోని సాధించలేనిది ఏదీ లేదు. దాంతో పాటు అతను నిరూపించుకోవాల్సి కూడా ఏమీ లేదు. కోహ్లికి పగ్గాలు అప్పజెప్పడానికి ధోని చేసిన త్యాగం చేశాడు.దాదా కెప్టెన్ కు  సలామ్'అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఓ టీవీ షోకు హాజరైన గంగూలీ తనదైన శైలిలో ఎత్తిచూపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  Ravi Shashtri  Team india best Captain  Test captaincy  cricket  

Other Articles