అత్యుత్తమ ప్రతిభ ఇంకా కనబర్చలేదు: అశ్విన్ My best is yet to come, says Ravichandran Ashwin

My best is yet to come says ravichandran ashwin

R Ashwin, Test cricket, best performance, India, india news

India's strike bowler Ravichandran Ashwin said he was bowling in one of his better phases but his best is yet to come.

అత్యుత్తమ ప్రతిభ ఇంకా కనబర్చలేదు: అశ్విన్

Posted: 01/08/2017 01:58 PM IST
My best is yet to come says ravichandran ashwin

టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. తన అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రాలేదంటున్నాడు.  తన జీవితంలో మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ, ఇది అత్యుత్తమ ప్రదర్శన అంటూ ఏదీ లేదన్నాడు. తన అత్యుత్తమ ప్రదర్శన గురించి ఏమీ చెప్పలేనన్నాడు. 'అత్యుత్తమ సమయం అనేది అబద్ధం. దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేము. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇది అని నేను చెప్పలేను. నీ జీవితంలో ఎప్పటికప్పుడు మెరుగు పడకపోతే వెనుకబడిపోతావు. నీకు నువ్వు మార్పును సృష్టించుకోలేకపోతే, నిన్ను నీవు మెరుగు చేసుకునే అవకాశం కూడా రాదు 'అని అశ్విన్ తెలిపాడు.

2015లో తన పేలవ ప్రదర్శన కారణంగా తల్లి అన్న మాటలను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ఎక్కడైనా పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వకపోతే తెరమరుగై పోతావు అన్న తల్లి మాటలను అశ్విన్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. పోరాటం నుంచి ఎప్పుడూ పారిపోవద్దనేది తాను నేర్చుకున్న పాఠం అని అశ్విన్ తెలిపాడు. ఇటీవల కాలంలో అత్యుత్తమ గణాంకాలతో చెలరేగిపోతున్న అశ్విన్ ఇంకా మెరుగైన ఫలితాలను సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : R Ashwin  Test cricket  best performance  India  india news  

Other Articles