విరాట్ కోహ్లీపై ప్రశంసలు గుప్పించిన కివీస్ కెప్టెన్ Williamson admits India series will be tough challenge

Kane williamson praises virat kohli and calls him a great batsman

Kane Williamson,virat kohli,India vs New Zealand,India,New Zealand,new zealand tour of india,Cricket,india cricket,New Zealand Cricket,williamson on kohli indian cricket news, cricket news, cricket

New Zealand captain Kane Williamson, the new New Zealand's captain admitted that he has learnt a lot from watching Kohli bat and termed the Indian skipper a great player.

విరాట్ కోహ్లీపై ప్రశంసలు గుప్పించిన కివీస్ కెప్టెన్

Posted: 09/14/2016 06:37 PM IST
Kane williamson praises virat kohli and calls him a great batsman

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై కేన్ విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. వర్తమాన క్రికెట్ లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ను ప్రతిభావంతులైన ఆటగాళ్లుగా పేర్కొంటారు. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఢిల్లీలో మాట్లాడుతూ, తన సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ ఆటతీరు తనకు నచ్చుతుందని అన్నాడు. మూడు ఫార్మాట్లలోను బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే తీరు ముచ్చటగొలుపుతుందని పేర్కొన్నాడు.

విరాట్ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తానని, తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. అతని ఆటతీరు నుంచి ఎంతో నేర్చుకోవచ్చని కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జోరూట్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆటతీరు కూడా బాగుంటుందని చెప్పాడు. అయితే తమ నలుగురిలో ఎవరి ప్రత్యేకత వారిదేనని, ఎవరి శైలి వారికుందని చెప్పాడు. మెక్ కల్లమ్ నుంచి కెప్టెన్సీ స్వీకరించడం బాగుందని చెప్పాడు. కెప్టెన్సీ తన ఆటతీరును ప్రభావితం చేయలేదని తెలిపాడు.

తమ జట్టులో చక్కటి ఆటగాళ్లున్నారని, అందరం కలిసి ఆటను ఆస్వాదిస్తున్నామని విలియమ్సన్ వెల్లడించాడు. భారత్ ను భారత్ లో ఎదుర్కోవడం అతిపెద్ద సవాలని, ఆ సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. గత పర్యటనలో టీమిండియా స్పిన్ ను ఎదుర్కోవడం తమకు చాలా కష్టంగా అనిపించిందని, ఈ సారి తమకు కూడా నాణ్యమైన ముగ్గురు స్పిన్నర్లున్నారని, తాము కూడా చక్కని ఫలితం సాధిస్తామని కేన్ విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kane Williamson  virat kohli  India  New Zealand  Cricket  

Other Articles