క్రికెటర్లపై ట్విట్లతో పండగ చేసుకుంటున్న ఫాన్స్ Gautam Gambhir Fans Target Virat Kohli And Selectors

Gautam gambhir fans target virat kohli and selectors

rohit sharma, gautam gambhir, shikar dhiwan, india new zealand, india new zealand series, india vs new zealand, india test squad, rohit sharma, rohit, sharma, test squad, pujara, cheteshwar pujara, india new zealand test squad, virat kohli, sandeep patil, stuart binny, sports, sports news, cricket, cricket news

Many people were expecting Gautam Gambhir to make the cut for the upcoming India-New Zealand Test series but he didn’t. His good form and credible scores didn’t impress selectors enough to get him a place in the Test side.

క్రికెటర్లపై ట్విట్లతో రభస చేస్తున్న ఫాన్స్

Posted: 09/14/2016 05:52 PM IST
Gautam gambhir fans target virat kohli and selectors

భారత్ పర్యటనకు వస్తున్న న్యూజిలాండ్‌, టీమిండియాతో 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు అడనున్న నేపథ్యంలో ఇటీవల జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇదే అంశంపై క్రికెటర్ల అభిమానులు ట్విట్ లతో తమ అభిమానులకు మద్దుతు పలుకుతూ.. పండగ చేసుకుంటున్నారు. అదేలా అంటారా.. క్రికెటర్ల ఎంపిక అంశంలో ఇప్పటి వరకు ఏం జరిగేదో తెలియదు కానీ మొత్తానికి ఎంపికైన జట్టు మాత్రం ప్రత్యర్థులతో బాగానే రానించేది, అలాంటిది ఏకంగా బిసిసిఐ, సెలక్షన్ కమిటీపై నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అభిమానుల నుంచి వస్తున్న ప్రతికూల ట్విట్ లపై స్పందించిన పెలక్షన్ కమిటీ ప్రధాన సభ్యుడు సందీప్ పాటిల్ టెస్టు జట్టుకు సభ్యుల ఎంపిక జాబితాను టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేలకు చేర్చడంతో తమ పని అయిపోయిందని.. వారిలోంచి మెరుగైన అటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కెప్టెన్, కోచ్ లపైనే వుంటుందని స్పష్టం చేశాడు. దీంతో అభిమానులు ఏకంగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్విట్ చేశారు.  పదే పదే విఫలం అవుతున్న శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను పక్కనపెట్టడంపై మండిపడుతున్నారు. దీనిపై గంభీర్ కూడా స్పందించడంతో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగింది. గంభీర్ ట్వీట్ చేస్తూ...'నిరాశ చెందినా పోరాటం ఆపను, నన్ను లక్ష్యం చేసుకుని పక్కన పెట్టినా భయపడేంత పిరికివాడిని కాదు, జట్టులో చోటు లభించకపోయినంత మాత్రాన నేను ఓడినట్టు కాదు, నా సహచరుడు గెలిచినట్టు కాదు... నేను పోరాడుతాను, పోరాడుతాను' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వెటరన్లు, సీనియర్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  new zealand  indian squad  rohit sharma  gautam gambhir  shikar dhiwan  cricket  

Other Articles