Sania demand for jet and make up kit

Sania demand for jet and make up kit

Sania Mirza, India, madhyapradesh, Sports News, Sania Mirza News, Latest Sania Mirza updates, Sania Mirza Dressing, Sania Mirza contraversy, sania mirza tennis, Pullela Gopichand, Yashodhara Raje, Madhra pradesh Sports Ministry

Madhya Pradesh sports department dropped the idea of inviting ace Indian tennis star Sania Mirza as chief guest for its annual sports awards function after state government refused to meet her demand for a makeup kit and chartered jet. Sports minister Yashodhara Raje Scindia made the disclosure during a lunch hosted in honour of this year's awardees at Hotel Jehan Numa Palace on Tuesday.

మేకప్ కిట్, ఛార్టెడ్ జెట్ టికెట్లు ఇస్తేనే సానియామీర్జా వస్తుందట..!

Posted: 12/02/2015 06:16 PM IST
Sania demand for jet and make up kit

స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇండియా పేరును ప్రపంచ వ్యాప్తంగా నిలిపింది. గత కొంత కాలంగా సానియామీర్జా తిరుగులేని విజయాలను నమోదు చేసింది. దాంతో అంతకు ముందున్న చరిష్మాకు తోడు.. కొత్తగా వచ్చిన పేరు సానియాను అందలం ఎక్కించినట్లు కనిపిస్తోంది. అందుకే ఓ స్పోర్ట్స్ అవార్డ్స్ ఫంక్షన్ కు ఆహ్వానిస్తే ఏకంగా అమ్మగారి మేకప్ కిట్, ఛార్టెడ్ జెట్ కావాలన్న డిమాండ్ తో షాక్ తిన్నారు. అవును సానియామీర్జా తన ఆటతోనే కాదు అందంతో కూడా ఆకట్టుకుంటోంది. అయితే అవార్డుల ఫంక్షన్ కు రావడానికి మేకప్ కిట్ డిమాండ్ చెయ్యడం మీద విమర్శలు గుప్పిస్తున్నారు విశ్లేషకులు. అయితే అమ్మగారు డిమాండ్ చేసిన మేకప్ కిట్ ధర ఎంతో తెలుసా..? అక్షరాల 75, 000లు. అసలు ఇదంతా ఎక్కడ..? ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అయితే చదవండి.

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుతంగా ముందుకు దూసుకెళుతోంది. గత కొంత కాలంగా తిరుగులేని సక్సెస్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ విజయ గర్వమో లేదా మరొకటో తెలియదు కానీ కాస్త అతిగా చేస్తుందేమో అనిపిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ యానువల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దానికి ఓ సెలబ్రెటీని ఆహ్వానించాలని.. సానియా మీర్జా అయితే బాగుంటుందని వారు ఆలోచించారు. అయితే అనుకున్నదే తుడువుగా వెంటనే ఆమెను సంప్రదించారు. అయితే అమ్మగారి డిమాండ్ విన్న తర్వాత వాళ్లు షాకయ్యారు.

అవార్డుల ఫంక్షన్ కు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అనుకుంటే అవార్డ్ ఫంక్షన్ నిర్వాహకులకు షాకిచ్చింది సానియా మీర్జా. తాను అక్కడికి రావాలంటే మేకప్ కిట్, ఛార్టెట్ జెట్ లో ఐదు బిజినెస్ క్లాస్ టికెట్లు కావాలని డిమాండ్ చేసిందట. అయితే ఆ రాష్ట్ర క్రీడా మంత్రి యశోధరా రాజే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. సానియా మీర్జా ఏమైనా బాలీవుడ్ హీరోయినా.. అంత ఖర్చు పెట్టి మేకప్ కిట్ అరేంజ్ చెయ్యడానికి.. ప్రజాధనం ఇలా మేకప్ కిట్ లకు ఖర్చు చెయ్యలేమని ఆమె వెల్లడించింది. దాంతో చేసేదేంలేక చివరకు పుల్లెల గోపీచంద్ ను ఆహ్వానించామని అతడు రావడానికి ఒప్పుకున్నాడని కూడా వెల్లడించింది.

(Source: Times of India)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles