Sania Mirza-Martina Hingis clinch seventh WTA title of the season at Wuhan Open

Sania mirza martina hingis win wuhan open title

Sania Mirza-Martina Hingis win Wuhan Open title, sania mirza, sania mirza martina hingis, martina hingis sania mirza, sania mirza martina hingis wimbledon, sania mirza us open, tennis news, tennis

Sania Mirza-Martina Hingis have won their last three tournaments and their last 13 matches without dropping a single set.

వుహాన్ ఓపెన్ తో ఏడో టైటిల్ ను ఖాతాలో వేసుకున్న సానియా-హింగిస్ జోడి

Posted: 10/03/2015 03:47 PM IST
Sania mirza martina hingis win wuhan open title

అధ్భుతం. ఇంకా చెప్పాలంటే మహాద్భుతం.. ఈ ఏడాది మంచి జోరును కనబరుస్తూ.. సరిలేరు తమకెవ్వరూ అంటూ టెన్నీస్ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతూ.. భారత, స్విస్ జోడి అందరి అంచానాలను మించి విజయాలను అందుకుంటోంది. తాజాగా చైనాలో జరిగిన వుహాన్ ఓపెన్‌ టైటిల్ను కూడా ఈ జోడీ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో భారత టెన్నిస్ డబుల్స్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, ప్రపంచ డబ్సుల్ నెంబర్ వన్ రాంకర్ సానియా మీర్జా.. తన స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్ తో కలసి ఈ విజయాన్ని సాధించింది. ఈ జోడీ రుమేనియాకు చెందిన ఇరీనా కామెలియా బెగూ - మోనికా నికెలెస్కూ జోడీపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది.  

ఈ ఏడాది పదో టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా వుహాన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏడో విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-1తో నాలుగో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్‌చాన్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. 53 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కాపాడుకొని ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Indo-swiss pair  Wuhan Open title  

Other Articles