Sania mirza enjoyed with trisha and simbhu in a party after awards function completed

sania mirza, trisha, simbhu, sania mirza latest news, sania mirza hot photos, sania mirza latest photo shoot, sania mirza trisha, sania mirza trisha simbhu, sania mirza press meet, trisha twitter, trisha hot gallery

sania mirza enjoyed with trisha and simbhu in a party after awards function completed

శింబు-త్రిష రిలేషన్ మధ్య వేలెట్టిన సానియా!

Posted: 11/03/2014 05:15 PM IST
Sania mirza enjoyed with trisha and simbhu in a party after awards function completed

గతంలో త్రిష, శింబుల మధ్య ప్రేమవ్యవహారాలు నడుస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే తమ మధ్య అలాంటివేమీ లేవని.. తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ అంటూ వాళ్లు ఆ రూమర్స్ ను కొట్టిపారేశారు. ప్రస్తుతం తమిళనాట వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఇదిలావుండగా.. వీరిద్దరి రిలేషన్ మధ్య తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వేలెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి చిత్రపరిశ్రమతో సానియాకు అంతగా సంబంధం లేదు కానీ.. అనుకోకుండా ఈ అమ్మడు త్రిష-శింబు రిలేషన్ మధ్య దూరిపోయింది. ఆ వివరాలన్నింటినీ తెలుసుకోవాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

చెన్నైలో ఓ లీడింగ్ మేగజైన్ ఓ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలోభాగంగా చాలామంది సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫంక్షన్ కు త్రిష, శింబు, సానియా మీర్జాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో త్రిషకు ‘‘దివా ఆఫ్ సౌత్’’ అనే అవార్డును ఆ మేగజైన్ సత్కరించగా.. ఇండియన్ టెన్నిస్ కు చేసిన సేవలకుగానూ సానియాకు కూడా ఒక అవార్డుతో సన్మానించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వేడుకలో సానియా ఇతర హీరోయిన్లకంటే చాలా గ్లామరస్ గా కనువిందు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మునుపెన్నడూలేని విధంగా ఆమె అందంగా రావడంతో అక్కడున్నవారు ఆమె అందానికి ఫ్లాట్ అయినట్టు సమాచారం!

ఇదిలావుండగా.. ఆ అవార్డుల కార్యక్రమం ముగిసిపోయిన అనంతరం అవార్డు లభించనందుకు సంతోషం వ్యక్తం చేసిన త్రిష.. తన ఇంట్లో పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి రావాలంటూ సానియాను కూడా రిక్వెస్ట్ చేసింది. దీంతో ఆమె తిరస్కరించలేక పార్టీకి వెళ్లింది. అలాగే మంచి ఫ్రెండ్ షిప్ వున్న కారణంగా త్రిష, శింబును కూడా పార్టీకి ఆహ్వానించింది. అలా ముగ్గురు ఆ పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అలా ఎంజాయ్ చేసిన నేపథ్యంలోనే వాళ్లు ముగ్గురు కలిసి ఒక సెల్ఫీ తీసుకోవడం జరిగింది. అలా ఆ విధంగా వీరిద్దరి ఫ్రెండ్ షిప్ రిలేషన్ మధ్య సానియా కూడా చేరిపోయింది. పార్టీలో తాము ముగ్గురు బాగా ఎంజాయ్ చేశామంటూ త్రిష ట్విట్ కూడా చేసిందని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  trisha  simbhu  magazine award function  telugu news  

Other Articles