Lee chong wei win fourth superseries finals title

Lee Chong, fourth Superseries title, Superseries Finals, BWF World Superseries, Tommy Sugiarto, Badminton news.

World number one Lee Chong Wei Sunday became the first player to win four titles in the season-ending BWF World record.

లీ చోంగ్ వీ ప్రపంచ రికార్డు

Posted: 12/16/2013 12:46 PM IST
Lee chong wei win fourth superseries finals title

ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ లీ ఛాంగ్ వి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది తన అద్బుతమైన ఆట తీరుతో వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న లీ చోంగ్ వీ (మలేషియా) బ్యాట్మింటన్ సీర్ ముంగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టైటిల్ సాధించడంతో వరుసగా నాలుగో సారి సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్స్ సాధించిన తొలి షట్లర్ గా రికార్డులకు ఎక్కాడు.

పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ 21-10, 21-12తో సుగియార్తో (ఇండోనేసియా)ను ఓడించాడు. గతంలో ఈ మలేసియా స్టార్ 2008 నుంచి 2010 వరకు వరుసగా మూడుసార్లు ఈ టైటిల్‌ను గెల్చుకున్నాడు.  మహిళల సింగిల్స్ ఫైనల్లో జురుయ్ లీ 21-8, 21-14తో తాయ్ జూ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. సింగిల్స్ విజేతలు లీ చోంగ్ వీ, జురుయ్ లీలకు 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 87 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles