High court tells bai to allow jwala gutta to play tournaments

Jwala Gutta can participate in all tournaments, Jwala Gutta, Ashwini Ponappa, Denmark Open, BAI, IBL

Jwala Gutta can participate in all tournaments, Jwala Gutta, Ashwini Ponappa, Denmark Open, BAI, IBL

బాయ్ కి చుక్కెదురు - జ్వాలాకి అనుమతి

Posted: 10/17/2013 07:09 PM IST
High court tells bai to allow jwala gutta to play tournaments

గుత్తా జ్వాలా కోర్టు కెక్కింది. అక్కడ తేల్చుకుంటానని ఢిల్లీకి వెళ్లింది. తన పై జీవితకాల నిషేధాన్ని విధిస్తూ (భాయ్ ) క్రమశిక్షణ సంఘం చేసిన సిఫార్సును వ్యతిరేకిస్తూ ఆమె ఢిల్లీ కోర్టు మెట్లు ఎక్కింది. క్రమ శిక్షణ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బాయ్ పై పిటీషన్ ధాఖలు చేసినట్లు ఆమె తండ్రి అయిన బ్యాడ్మింటన్ ప్లేయర్ తండ్రి క్రాంతి గుత్తా వెల్లడించారు. ఈ పిటిషన్ పరిశీలించిన జస్టిస్ వీకే జైన్ నేడు విచారణ జరపనున్నారు. ఈమె పై క్రమ శిక్షణ చర్యలు తీసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసిన బాయ్ నెల రోజుల పాటు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించడంతో వాటన్నింటిని కొట్టివేయాలని జ్వాలా ఆ పిటీషన్ లో కోరింది.  భాయ్ ఆదేశాలు న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉన్నాయని, నా వాదన వినకుండానే నాపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని అంది. మరోవైపు జ్వాల కోరితే ఈ వివాదాన్ని తాము పరిశీలిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. గుత్తా పిటీషన్ పై కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles