ఎగ్స్
కోడి గుడ్డులో ఉండే ఐరన్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు పట్టులా నిగనిగలాడేలా చేస్తుంది. అంతేకాదు.. ఇందులో వుండే పోషకాలు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. గుడ్డు తినడం ఇష్టం లేకపోతే.. దాన్ని పగులగొట్టి అందులో ఉండే తెల్ల సొనను జుట్టుకు పెట్టుకొని గంట తర్వాత కడిగేస్తే.. కురులు నిగనిగలాడుతూ ఉంటాయి.