Andhra pradesh forest act

Andhra Pradesh Forest act

Andhra Pradesh Forest act

Andhra Pradesh Forest act.png

Posted: 11/19/2012 05:03 PM IST
Andhra pradesh forest act

నేను ఒక పేద, దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. నా ఇంటి పక్కన ఎక్కువగా అటవీ ప్రాంతం ఉన్నది. ఇవన్నీ అటవీ భూములు అని చెబుతారు మా గ్రామ పెద్దలు. అసలు అటవీ భూములు అంటే ఏమిటి? వాటిని అనుభవించే హక్కు ఎవరికుంటుంది ?

ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం 1967లోని సెక్షన్‌(4) ప్రకారం ప్రకటించబడి, తదుపరి సెక్షన్ల ప్రకారం అప్రకటిత ప్రాంతంపెై ఆధారపడ్డ ప్రజల హక్కులను గుర్తించిన తరువాత సెక్షన్‌ 15లో ప్రకటించిన ప్రాంతాలను రిజర్వ్‌ అడవులు అని పిలుస్తారు. అసలు అడవి అనేది ఈ చట్టంలో కాని భారత అటవీ చట్టంలో గాని నిర్వచించబడలేదు. భారత అటవీ హ క్కుల చట్టం 2006 ప్రకారం అటవీ భూ ములు అంటే రక్షిత అడవులు, రిజర్వు అడవులు, అభయారణ్యాలు వర్గీకరించబడిన అడవులు, సరిహద్దు నిర్దారించన అడవులు, ప్రస్తుతం ఉన్నా కానీ అంగీకరించబడిన అడవులు (డీమ్డ్‌ ఫారెస్ట్‌), జాతీయ పార్కులు వస్తాయి. దీనిని ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం 1967లోని సెక్షన్‌ (4) షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సంప్రదాయ అటవీ నివాసుతుల అటవీ హ క్కుల గుర్తింపు చట్టం, 2006 లోని సెక్షన్‌ 2(ఎ), ఇవి అడవిలో నివసించే షెడ్యూలు తెగ లు,తరతరాలుగా ఆయా అడవులలో నివసించే ఇతర సంప్రదాయక అటవీ నివాసుల కు అటవీ భూములపెై హక్కులు వుంటాయి.

అయితే ఆంధ్రప్రదేశ్‌ అటవీచట్టం 1967 ప్రకారము సెక్షన్‌ (4) ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి.భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం డిసెంబర్‌ 13, 2005కు ముందు అక్రమణలో ఉన్న భూములపెై హక్కులు ఉంటాయి. ఇతర సం ప్రదాయక అటవీ నివాసులు అయితే 13వ తేది డిసెంబర్‌ 2005 కు మందు మూడు తరాలుగా (75 సంవత్సరాలు) ఇదే అడవిలో నివసిస్తున్నట్లు వ్రాతపూర్వకంగా ఆధారాలతో, ప్రధానంగా అనగా ఇప్పుడు అక్కడే జీవిస్తున్న వాళ్ళకే ఈ అటవీ హక్కులు సంక్రమిస్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలు అయి ఆ తేది నాటికి నివసిస్తుండే వారికి హక్కు ఏర్పాటు అవుతుంది. షెడ్యూలు తెగలు, సంప్రదాయక అటవీ నివాసులలోని వ్యక్తులు కాని సమాజం గాని, అక్రమించిన అడవిపెై నివాసానికి, జీవనం గురించి చేసే సొంత వ్యవసాయానికి హక్కులు ఉంటాయి, పూర్వకాలపు రాజులు, జమీందారులు, మధ్యవర్తి రాజులు నుండి సంక్రమించిన నిస్టార్‌ లాంటి హక్కులు, గ్రామ సరిహద్దులలో గాని బయట నుంచి సంప్రదాయకంగా సేకరించి చిన్నతరహా అటవీ ఫల సాయంపెై ఆస్తిహక్కు వాడుకోవటానికి గాని, అమ్ముకోవటానిి గాని సేకరించే హక్కులు అదే విధంగా చేపలు లాంటి జలచరాలు, సంప్రదాయంగా పశువులు మేసే స్థలాల లాంటివి, ముఖ్యంగా సంచార జాతుల వారికి హక్కు ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Government land registration
How to get an immediate divorce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles