UPCOMING Movies

I Movie Preview

ఐ (మనోహరుడు)

క్రియేటివ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా ‘ఐ’. భారీ బడ్జెట్, గ్రాఫిక్ ఎఫెక్ట్స్, సెట్టింగులతో ఈ సినిమాను నిర్మించారు. 1.6బిలియన్ డాలర్ల ఖర్చుతో ‘ఐ’ సినిమాను తెరకెక్కించారు. చియాన్ విక్రమ్ హీరోగా.., అమీ జాక్సన్ హీరోయిన్ గా ఇందులో నటించారు. ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు వేణు రవిచంద్రన్, రమేష్ బాబు నిర్మాతలుగా ఉన్నారు. ఏ.ఆర్. రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

‘ఐ’ మూవీని దీపావళి ( అక్టోబర్ 23)న విడుదల చేయాలని ప్లాన్ చేసినా.., డబ్బింగ్, గ్రాఫిక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యం జరిగింది. దీంతో నవంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతా కుదిరితే నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తారు. తమిళ, తెలుగు, హిందీ సహా ఇతర భారతీయ భాషలతో పాటు పలు ప్రపంచ భాషల్లోకి సినిమాను డబ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరువేలకు పైగా థియేటర్లలో ‘ఐ’ సినిమా విడుదల కానుంది.

కార్తిక్