UPCOMING Movies

పైసా

నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. కృష్ణవంశీ మాట్లాడుతూ...పచ్చనోటు అన్వేషణలోనే జీవితం గడిచిపోతోంది. మనిషి ఆశ.. శ్వాస.. పైసానే. అందుకోసమే ఎన్ని ఎత్తులేసినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా. మా హీరో పైసల కోసమే పోరాటం చేశాడు. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.