UPCOMING Movies

హార్డ్‌ఎటాక్‌

నితిన్ హీరోగా రూపొందిన చిత్రం 'హార్డ్‌ఎటాక్‌'. అదాశర్మ హీరోయిన్. పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం పూరీ స్వయంగా తన బ్యానర్ పై తీయటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా బ్యాంకాక్ లో విడుదలైంది.

చిత్రంలో నితిన్ పేరు వరుణ్‌. అతను చేసే పని... దేశాలు పట్టుకు తిరగడం.. అదేనండి ట్రావెలర్‌. ఆయా దేశాల్లో ప్రకృతి అందాలు చూసి మురిపోతున్న వాడికి ఓ అమ్మాయి కనిపించింది. పేరు హయాతి. అందమంటే ఇదీ అనిపించేలా ఉంది ఆ అమ్మాయి. ఇంకేముంది ఆ అమ్మాయి వెంట పడ్డాడు. అయితే అది ప్రేమ కోసం కాదు... ముద్దు కోసం. అతడికి తెలియని విషయమేమిటంటే ఆ అమ్మాయి వాణ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందని. మరి ఈ కథేమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు.