అజిత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు ? | Thala Ajith will next Chief Minister of Tamil Nadu.

Thala will next chief minister of tamil nadu

Ajith next CM, Thala Ajith will next Chief Minister of Tamil Nadu, AIADMK Ajith Kumar, TN chief minister Ajith, Ajith Kumar next CM for Tamilnadu, Jayalalitha Ajith, Jayalalitha suggest Ajith Name, Ajith Name in CM race, Ajith Kumar TN CM, Jayalalitha Condition Critical, Thala with Jayalalitha

Thala Ajith will next Chief Minister of Tamil Nadu. CM Jayalalitha also giving nod. AIADMK oddicially announced it soon.

ఏంటీ? అమ్మ మనసులో అతను ఉన్నాడా!

Posted: 10/06/2016 03:33 PM IST
Thala will next chief minister of tamil nadu

20 రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ కోసం వీరాభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆమె కోలుకుంటుందని చెబుతున్నప్పటికీ క్షణానికో ఉత్కంఠ కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటుండటంతో అసలు అపోలోలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి. ఇదిలా ఉంటే... మరోవైపు కీలకమైన పాలనా వ్యవహారాలపై రకరకాల కోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. అమ్మ తర్వాతి వారుసులు ఎవరంటూ అంతర్గతంగా చర్చలు... ఇంతలో ఓ వేటు ఓ స్టార్ వైపు చూపించారు.

అది ఎవరో కాదు. స్టార్ హీరో అజిత్ కుమార్ అంటూ. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల వైపు మొగ్గు లేకపోవటం, మరోస్టార్ హీరో విజయ్ అన్నాడీఎంకేలకు అంత మంచి సంబంధాలు లేకపోవటంతో ఇప్పుడు దృష్టంతా అజిత్ వైపు మళ్లింది. వివాదరహితుడిగా పేరున్న అజిత్ కు తమిళనాట భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. సేవాగుణంలో టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో, అక్కడ తలా అజిత్ కూడా అలాగే అంటూ పోలుస్తుంటారు. అందుకే అన్నాడీఎంకే పగ్గాలను అజిత్ కు అప్పగించే అవకాశం ఉన్నాయంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనాలు ప్రచురించింది.

అంతేకాదు జయలలిత అందుకు సంబంధించిన వీలునామాను సన్నిహితులకు అప్పజెప్పిందని, తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి అజితేనంటూ సదరు పత్రిక నిర్ధారణ చేసేసుకుంది. గతంలో అవినీతి ఆరోపణలపై ఆమె జైలుకి వెళ్లినప్పడు పన్నీర్ సెల్వం సీఎంగా భరతుడి టైప్ లో పాలన నిర్వహించాడు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అనుచరుడు అయినప్పటికీ, పన్నీర్ కు మళ్లీ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు మాత్రం లేవనే అంటున్నారు. ఇంకోవైపు శశికళ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, ఆమెకు రాజకీయ అనుభవం లేన్నందున పక్కకు పెట్టేశారంట. దీంతో జయకు సన్నిహితుడైన అజిత్ కే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయంటూ అందులో పేర్కొంది.

అయితే పాలనాపరంగా అనుభం లేని అజిత్ ను ఒక్కసారిగా సీఎంను చేస్తే ఇబ్బందులు తలెత్తే (విమర్శలు కూడా) అవకాశం ఉన్నందున, ముందు పన్నీర్ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా చేసి, ఆపై అజిత్ ను నెమ్మదిగా సీఎంగా ప్రకటించాలన్న భావనలో అన్నాడీఎంకే ఉన్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ, అత్యంత కీలకమైన నేతల ద్వారానే ఈ లీకులు బయటికి వచ్చినట్లు సదరు కథనం చివర్లో ఆ పత్రిక పేర్కొంది. ప్రస్తుతానికైతే జయకు, ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్, కొందరు అధికారుల సాయంతో కీలక నిర్ణయాలను తీసుకుంటూ పాలనను నడిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : TamilNadu  CM Jayalalitha  Next CM  Ajith Kumar  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more