బాలయ్య శాతకర్ణి నుంచి దేవీ ఔట్ | Devisri prasad out from balayya GPS

Devisri prasad out from balayya gps

Balayya 100, devi sri prasad for balayya, Devisri Prasad out from GPS, krish ousted devi from GPS

Devisri prasad out from balayya GPS

బాలయ్య 100 నుంచి అతన్ని తీసేశారా?

Posted: 08/10/2016 09:38 AM IST
Devisri prasad out from balayya gps

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం టెక్నికల్ టీంను చాలా టైం తీసుకునే ఎంపిక చేసుకున్నాడు క్రిష్. ఆర్ట్ డైరక్టర్ దగ్గరి నుంచి గ్రాఫిక్స్ వర్కర్ల దాకా అంతా అనుభవం ఉన్నవారే ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇక చారిత్రాత్మక సినిమాలకు చాలా అవసరమైన సంగీత నేపథ్యం కోసం రాకింగ్ దేవీశ్రీ ప్రసాద్ కి బాధ్యతలు అప్పజెప్పాడు.

షూటింగ్ ప్రారంభం కాకముందే యూఎస్ వెళ్లిన దేవీ అక్కడ మ్యూజిక్ సిట్టింగ్ లు వేస్తూ, శాతకర్ణికి సంబంధించి వర్క్ ప్రారంభమయ్యిందంటూ ఓ ఫోటోను కూడా ఉంచాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే... ఈ చిత్రం నుంచి దేవీని తొలగించినట్లు తెలుస్తోంది. అనుకున్న ప్రకారం దేవీ సంక్రాంతి వరకు ఔట్ పుట్ ఇవ్వకపోవటమే దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. నిజానికి నాన్ స్టాప్ కమిట్ మెంట్ కు ఓకే చెప్పిన తర్వాతే క్రిష్ ఈ సినిమా కోసం  దేవీశ్రీ ప్రసాద్ ను తీసుకున్నాడు. కానీ, ఈ సినిమాతోపాటు మరో మూడు పెద్ద చిత్రాలకు సంగీతాన్ని అందించేందుకు ఒప్పుకోవటం, వాటి పనుల్లో కూడా మునిగిపోవటంతో ఆలస్యం అయ్యేలా ఉండటంతో అతన్ని మార్చేయాలని క్రిష్ భావిస్తున్నాడంట.

దీనికి తోడు మ్యూజిక్ సిట్టింగ్ ప్రారంభమయి ఆరు నెలల పైనే అవుతున్నా కనీసం ఇప్పటిదాకా పూర్తయిన టాకీ పార్టులో పదో వంతు సంగీతాన్ని కూడా దేవీ రెడీ చేయలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని రీప్లేస్ చేయటం తప్పించి మరో మార్గం లేదని చిత్ర యూనిట్ అనుకుంటోంది. దీనిపై ఇంకా అధికార ప్రకటన వెలువడకపోయినప్పటికీ, ఒకవేళ మార్చాల్సి వస్తే మాత్రం ఆ స్థానంలో మణిశర్మకు పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balayya  GPS  100th movie  Krish  devisri prasad  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more