Rajnikanth career in dilemma directors new movie offers

rajinikanth latest news, rajnikanth latest news, rajnikanth movie offers, rajnikanth movie news, tamil distributors, rajnikanth distributors, kollywood gossips, kollywood news, tollywood gossips

rajnikanth career in dilemma directors new movie offers : rajnikanth thinking about his future movies. He is in dilemma that his future may stuck in problems if his latest movie will fail. so that he is not accepting any movie at this movement.

రజనీకి శాపంగా డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన

Posted: 01/19/2015 01:18 PM IST
Rajnikanth career in dilemma directors new movie offers

ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇటీవలికాలంలో ఆయన నటించిన ‘కొచ్చాడయాన్, లింగా’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో.. ఆయా చిత్రాలను భారీగా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా దెబ్బతిన్నారు. రజనీకి వున్న క్రేజ్’తో ఆయన చిత్రాలు బాగానే వసూళ్లు చేస్తాయనే నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా డిస్ట్రిబ్యూటర్లు అధికమొత్తం వెచ్చించిమరీ ఆయన చిత్రాలను తీసుకున్నారు. కానీ.. ఆ మూవీలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. వారికి లాభాలు కాదుకదా.. కనీసం తీసుకున్న మొత్తం కూడా అందక భారీగా నష్టపోయారు.

ఇలా నష్టపోయిన వారందరూ తమను ఆదుకోవాలంటూ రజనీ ఇంటిముందు కొందరు ఆందోళనలు చేపట్టారు కూడా! ఇప్పుడైతే ఆ ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయి కానీ.. రజనీకి మాత్రం అవి శాపంగా మారినట్లు తెలుస్తోంది. తన సినిమాల ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు జరిగిన భారీ నష్టాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన.. ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో మునిగిపోయారని కోలీవుడ్’లో ప్రచారం జరుగుతోంది. ఈసారైనా తాను నటించబోయే చిత్రం కమర్షియల్’గా హిట్ కొట్టకపోతే.. ఆయన కెరీరే ఎక్కడ ఇబ్బందుల్లో పడిపోతుందేమోనన్న టెన్షన్’లో రజనీ పడ్డట్లు చెప్పుకుంటున్నారు. అందుకే.. కొందరు దర్శకులు తమ కథలతో క్యూలో నిలబడినా.. ఆయన మాత్రం దేనికీ ఓకే చెప్పలేకపోతున్నాడట!

ముఖ్యంగా గతంలో రజనీతో ‘చంద్రముఖి’ చిత్రాన్ని తీసిన పి.వాసు ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని వుంటే.. మరోవైపు ‘బాషా’ చిత్రాన్ని తెరకెక్కించిన సురేష్ కృష్ణ ఆ మూవీకి సీక్వెల్ తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదు.. మరో నలుగురైదుగురు దర్శకులు తమ కథలతో లైన్’లో వున్నారట! కానీ.. రజనీ నుంచి మాత్రం ఏ విధమైన స్పందన వారికి లభించడం లేదు. ఈసారి తీయబోయే తన సినిమా ఫ్లాప్ అయితే.. డిస్ట్రిబ్యూటర్లు తనమీద నమ్మకం కోల్పోవడంతోబాటు తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే భావనలో మునిగిపోయారట! అందుకే.. ఏ కథనూ తేల్చుకోలేక ‘స్టే’లో పెట్టేసినట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more