Sharath marar considers pk movie telugu remake pawan kalyan

pk movie telugu remake, pawan kalyan in pk movie telugu remake, sharat marar on pk telugu rights, aamir khan pk movie collections, pk movie record collections latest updates, aamir khan upcoming movie updates, pawan kalyan upcoming movie updates

sharath marar considers pk movie telugu remake pawan kalyan : aamir khan pk movie huge collections breaking bollywood movies records. film nagar latest gossip that sharat marar of pawan kalyan gopala gopala producer waiting for power star's response to buy remake rights for telugu

పి.కె. తెలుగు రీమేక్..? హీరో ఎవరో తెలుసా...?

Posted: 12/24/2014 11:57 AM IST
Sharath marar considers pk movie telugu remake pawan kalyan

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తున్న పీ.కే. సినిమాపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమాను అమీర్ ఖాన్, రణబీర్ తో సీక్వెల్ తీస్తారని బిటౌన్ లో తెగ ప్రచారం జరుగుతోంది. రెండ్రోజుల క్రితం ఇదే విషయంపై డైరెక్టర్ సీక్వెల్ లో నటించమంటే అంతకంటే సంతోషం ఏముందని మనసులో మాటను ఖాన్ కూడా బయట పెట్టాడు. ఈ సినిమా సీక్వెల్ వస్తుందా.., రావటం లేదా అనేది కొద్దికాలం ఆగితే బయటకు తెలుస్తుంది. ప్రస్తుతం బి టౌన్ కంటే ఫిలింనగర్ లోనే పి.కే.పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని ఫిలింనగర్ అంతా మాట్లాడుకుంటోంది.

ఇండస్ర్టీకి చెందిన ప్రముఖులు ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వస్తున్నాయి. రేసులో దిగ్గజ నిర్మాతలు చాలామందే ఉన్నారు. అందులో ఆసక్తికరంగా విన్పిస్తోంది శరత్ మరార్ పేరు. ఈయనెవరో తెలుసుగా, పవన్ కళ్యాణ్ స్నేహితుడు. అంతేకాదు ఆయన సినిమాలను కూడా ఈ మద్య నిర్మిస్తున్నారు. మరీయన ఎవరి కోసం సినిమాను కొంటున్నారు అంటే., ఇంకెవరు పవర్ స్టార్ కోసమే అని టాక్ విన్పిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ (పి.కె.) ఈ హిందీ సినిమాలో నటిస్తాడు అని పుకార్లు వస్తున్నాయి.

పికే తెలుగు రైట్స్ రేసులో ఉన్న శరత్ పవన్ అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నాడట. పవర్ స్టార్ ఓకే చెప్తే వెంటనే రైట్స్ ను కొనేందుకు ఎంత ఖర్చయినా వెనకాడడు అని సన్నిహితులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ కు ఫీవర్ లో ముంచెత్తిన ‘పికే’లో పవన్ నటిస్తే సూపర్ హిట్ అవతుంది అని టాక్ కూడా విన్పిస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.., పవర్ స్టార్ నిర్ణయమే ఇప్పుడు కీలకం. ఆయన పీకేకు ఓకే అంటాడా లేక.., డోంట్ కేర్ అని లైట్ తీస్కుంటాడా తెలియాల్సి ఉంది.

గతవారం విడుదల అయిన ‘పీ.కే.’ మూవీ రికార్డుల ప్రకంపనలు సృష్టిస్తోంది. అమీర్ ఖాన్ అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును దాటి దూసుకెళ్తోంది. దేశంలో 5వేలకు పైగా థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీకి హిట్ సూపర్ హిట్ టాక్ వచ్చింది. తమ సినిమా ఇంత విజయం సాధించటం పట్ల సంతోషంగా ఉందని మూవీ యూనిట్ తెలిపింది. సినిమా కోసం పడిన కష్టం ఫలించిందని అమీర్ ఖాన్ చెప్తున్నాడు. తన కెరీర్ లో ఇదో బ్లాక్ బస్టర్ గా మిగులుతుందని అనుష్క తెలిపింది.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pk movie telugu remake  pawan kalyan latest  aamir khan updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more