టాలీవుడ్ నటుడు నాగార్జున అంటే కొంతమందికే తెలుస్తోంది. కానీ బిజినెస్ ‘బాస్ ’నాగార్జున అంటే మాత్రం మన రాష్ట్రంతో పాటు.. ఇతర రాష్ట్రాల ప్రజలకు, నేతలకు, చివరకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలుసు. నాగార్జున (నాగ్) అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
నాగ్ రెండు కళ్ల సిద్దంతాన్ని నమ్మే వ్యక్తి అని రీసంట్ గా తెలిసింది. నాగ్ కు నచ్చితే.. నవ్వుతాడు.., ఆపై కౌలిగించుకుంటాడు.. కానీ నాగ్ కు నచ్చకపోతే.. ఆయన నీడకూడా అటువైపు పడకుండ చాలా జాగ్రత్త పడతాడు. ‘‘ నాగ్ నడక నేర్చుకునే వయసులోనే., అడ్డదారి ఎలా తొక్కాలి, నాలుగు రాళ్లు ఎలా వెనకేసుకోవాలి, ఎవరికి సున్నం పూయాలి, ఎవరికి .. వెన్న పూయాలి అనే విద్యలు బాగా నేర్చుకున్నట్లుగా..ఆయన అభిమానులు, టాలీవుడ్ సినీ పెద్దలు చాలా గొప్పగా చెబుతుంటారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో.. నలుగురికి ఉపయోగపడని నటుడు ఎవరు? అంటే మన అక్కినేని నాగార్జనే అని చిత్రపురి కాలనీ వాసులు ఖచ్చితంగా చెబుతుంటారు. కానీ ‘‘సొంత లాభం ఉంటేనే ఎవరితోనైన.. చేతులు కలుపుతాడనే ’’ అని బిరుదు ను కూడా నాగే సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా పక్క కమర్షియల్ మైండ్ కలిగిన వ్యక్తి నాగార్జన అని చిత్రపరిశ్రమ లోని కొంత మంది నిర్మాతలు అంటున్నారు.
నాగ్ తొక్కుతున్న అడ్డదారులు చూసి ఆయన అభిమానులే ఛీ కొడుతున్నారు. ఎక్కడ బెల్లం ఉంటే.. అక్కడికి వెళ్ళటం మా నటుడికి బాగా అలవాటుగా మారిందని తెలంగాణలోని నాగ్ ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే ఇప్పటి వరకు ‘‘ నీ వల్ల ఏంటీ లాభం ’’ అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు, నీతోటి హీరోలు.. తొడలు కొట్టుకొని, రెమ్యునెరేషన్ తగ్గించుకోని నిర్మాతలను బతికించి, నిజమైన హీరోలుగా అభిమానుల మనసు గెలుచుకున్నారు. అలాంటి వారిలో బాలయ్య, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి వారు ఉన్నారని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
అయితే ఆ హీరోలు సంపాదించుకున్న ధనంలో..కొంచెం ప్రజలకు, అభిమానులకు ధానం చేసి మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు.. నీవు గానీ నీ కుటుంబం గానీ.. మీ చేతులతో ఎవరికైన సాయం చేసినట్లు చూపించగలవా! అని సినీ అభిమానులు అడుగుతున్నారు.
అసలు అక్కినేని వారి వల్ల దేశానికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, అంతకంటే టాలీవుడ్ లోని వ్యక్తులకు అసలు ఉపయోగం లేదు., కానీ మీ వారసత్వ సినిమాలు మాత్రం మేము చూడాలి? మీరు మాత్రం అభిమానుకుల ఉపయోగపడారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ప్రజలైతే.. ఘోరంగా తిడుతున్నారు. అయినా నాగ్ కే ఇలా ఎందుకు జరుగుతుంది.!
‘‘ఆయన అమ్మాయిలకు ‘మన్మథుడు’, వ్యాపార్తవేత్తలకు ‘బాస్’, కోరికలు కోరని భక్తులకు ‘శ్రీరిడి సాయి బాబా’, కానుకలిచ్చే భక్తులకు ..‘అన్నమయ్య ’, ఉన్నవారి వద్ద మోగే ‘ఢమరుకం’, ఈయనకు ఆపదులు వస్తే మాత్రం .. ‘మనం ’ దరం ఆదుకోవాలి. కానీ నాగ్ మాత్రం ఎవరికి ఉపయోగపడడు, ఈయన వల్ల ఎలాంటి లాభం లేదని చదువుకున్న, యువతి, యువకులు అంటున్నారు.
నాగ్ తొక్కే అడ్డదారి చూసి ఆయన ఫ్యాన్స్ కే చిరాకుపుడుతంది. నీతి, నీజాయితి, నియమాలు ఏమీ లేవు అనే విధంగా నాగ్ ప్రవర్తిస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మొన్న నరేంద్ర మోడీ, నిన్న చీకట్లో .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, నేడు సీమాంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఇలా అందరితో చేతులు కలుపుతూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ, నవ్వులు నాగ్ గా కనిపిస్తున్నావు.. ఒక్కసారి ఆలోచించు.. ఇది నీకు అవసరమా? తెలుగు అభిమానులు ప్రశ్నిస్తున్నారు, అయినా నీ టచ్ తో ఆ నేతలకు భయం పట్టుకుంటుందని ఆయా పార్టీల కార్యకర్తలు అంటున్నారు. ‘‘నాగ్ అంటే ..నలుగురికి ఉపయోగపడడు ’’ అనే ట్యాగ్ లైన్ ఉందని.. చిత్రపురి కాలనీ వాసులు అంటున్నారు.
అవును..!!! తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నీ ఎక్కడ కనిపించావ్!, అలాగే సమైక్యంద్ర కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఏం చేస్తున్నావ్!, అని రెండు రాష్ట్రాలా ప్రజలు అడుగుతున్నారు. ‘‘అన్నపూర్ణ స్టూడియో’’ను బతికించుకోవటానికి .. నక్క వినయాలు వేస్తున్నవు్ . చంద్రబాబు మాదిరే నీవు రెండు కళ్ల సిద్దంతం నమ్మి సైలెంట్ గోడ మీద పిల్లి మాదిరి చూస్తుంటావ్! .. కానీ నీ వల్ల ఎవరికి ఉపయోగలేదని ఇటీవలే తెలిసిందని ఫిలింనగర్లో టాక్ నడుస్తుందని సినీ పెద్దలు అంటున్నారు.
నాగ్ ! నీవు నడుస్తున్న ..నడకలు చూస్తుంటే.. ‘‘రెండు పిల్లులు.. ఒక రొట్టే... ఒక కోతి ’’ కథ గుర్తుకు వస్తుంది. ‘‘రాత్రి కి రాజకీయ నాయకులతో ‘టచ్’ లో ఉంటావు, పగలైతే.. ప్రభుత్వ అధికారులతో పబ్బం గడుపుతావు. నీకు అధికారం లేకపోయిన ఆర్థికంగానే బాగా సంపాదించుకుంటున్నావనే టాక్ ఉందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అది సినిమాలో నటించి సంపాదించిన డబ్బు కాదని చిత్రపురి కాలనీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, అలాగే మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , ఇప్పుడు కేసిఆర్, చంద్రబాబులను కూడా వదలకుండా, టచ్ లో ఉన్నావు. ఎవరు హై పోజిషన్లో ఉంటే వారి వద్ద డేగలా వాలిపోతావ్. అయినా నీ టచ్ వల్ల చంద్రబాబుకు, కేసిఆర్ కు ఏమిటీ లాభం? అంటే.. పెద్ద బొక్కే అంటున్నారు ఆ పార్టీలోని సినియర్ నాయకులు. ఈ ఇద్దరి సీఎం టచ్ తో నాగ్ చల్లగా బతకాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
మనిషి అన్నవాడు సంపాదించుకోవాలి, కానీ అందరు సాయంత్రం వరకు సంపాదించుకుంటారు, నాగ్ మాత్రం.. పగలు, రాత్రి అని తేడా లేకుండా.. స్వాలాభం కోసం పరుగులు తీస్తాడని ఆయన అతి సన్నిహితులే అంటున్నారు. వైఎస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ లతో జైల్లో నీవు కలిసిన ‘టచ్ ’ గురించి అందరికి తెలుసు. కానీ నీలో మంచి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని ప్రజలకు, ప్రక్రుతికి గానీ ఎప్పుడు ఉపయోగించలేదని ఆయన అభిమానులే అంటున్నారు.
అయితే నాగ్, చంద్రబాబును కలిసిన విషయం బాలయ్య తెలియటంతో.. ఆవేశంతో ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మన పార్టీ , మన నేతగానీ గుర్తుకు రాలేదా? అని చంద్రబాబు ఫోన్ చేసి బాలయ్య అడిగినట్లు టాలీవుడ్ సమాచారం. అంతేకుండా .. నాగార్జున వల్ల లాభం ఏంటీ? అని చంద్రబాబు ను ప్రశ్నించినట్లు పార్టీలోని సినియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే చంద్రబాబు.. నాగార్జన రాక పై ఎలాంటి ఆనందం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఇన్నాళ్లూ హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో వుండటంతో రాష్ర్టానికి కాబోయే ముఖ్యమంత్రులని కలవడం ఆయనకి ఆనవాయితీగా వచ్చింది. ఇక ఇప్పుడు రాష్ర్ట విభజనతో రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులని కలవాల్సి వస్తున్నట్లుంది అని ఫిలింనగర్ వాసులు చర్చించుకుంటున్నారు.
నాగ్ ఇకనైన.. మారి తెలుగు ప్రజలకు ఉపయోగపడాలని..అక్కినేని అభిమానులు, తెలుగు ప్రజలు , చదువుకున్న యువతి, యువకులు కోరుతున్నారు. 2019లో.. ఎ పార్టీ జెండా కిందకు చేరుతాడో.. ఇలాగే.. అందరికి ‘టచ్ ’ లు ఇస్తూ ముందుకు సాగిపోతాడో.. చూద్దామని అభిమానులు అంటున్నారు. ఇక నాగార్జున దారి ఎటు పోతుందో..చూద్దాం.
REBBA..
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more