ప్రముఖ దర్శకుడు, ఓటమి ఎరుగని.. విక్రమార్కుడు రాజమౌళి పై టాలీవుడ్ దర్శకులు మండిపడుతున్నారు. దర్శకులతో పాటు నిర్మాతలు కూడా ఫైర్ అవుతున్నారు. అయితే వీరికి రాజమౌళి ఏం అన్యాయం చేయలేదు. కానీ వీరు తీసిన సినిమాలు చూడటమే.. రాజమౌళి చేసిన తప్పుని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
అయితే రాజమౌళి మీద తోటి తెలుగు దర్శకులే ఫిర్యాదు చేయడానికి సిద్దమవటంతో టాలీవుడ్ పెద్దలు సైతం ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి చేస్తున్న కొన్ని పనుల వలన వీళ్ళంతా కట్టగట్టుకొని మరీ దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది.
రాజమౌళి చేసిన తప్పు చాలా చిన్నదే కానీ దానికి భారీ నష్టం జరుగుతుందని తెలుగు దర్శకులు భావించి పిర్యాదు చేస్తున్నారు. ఆయన ఖాళీ సమయం దొరికినప్పుడు కొత్త సినిమాలు చూస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ సినిమా గురించి పదిమందితో పంచుకుంటారు. అదే రాజమౌళి చేసిన తప్పు. దీనికే దర్శకులు కంప్లైంట్ చేస్తున్నట్లు సమాచారం.
అంటే రాజమౌళి ఏవిషయం అయిన తన అభిమానులతో షేర్ చేసుకోవటం బాగా అలవాటు. అదే ఇప్పుడు పెద్ద తప్పుగా కనిపిస్తుంది. రాజమౌలి ట్వీట్స్ ఇప్పుడు కొన్ని సినిమాలకు ప్రచారంగా మారుతున్న సంగతి తెలిసిందే. సినిమాలోనే పలానా అంశం నచ్చింది అంటూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు చేరవేస్తాడు.
అదే ఇప్పుడు కొంతమంది దర్శకులకు చిక్కు వచ్చిందట. రాజమౌళి ప్రతి సినిమా చూడడు.. చూసినా అన్ని సినిమాల గురించి చెప్పాడు కనుక ప్రేక్షకులు కూడా రాజమౌళి ట్వీట్ చేస్తే మంచి సినిమా లేకపోతే అన్నట్లుగా ఫీలైపోతున్నారని.. ఇలా జరగడం వలన తమ సినిమాలను నష్టం అవుతుందని.. ఆయన గొప్ప దర్శకుడే కావచ్చు కానీ ఇలా రివ్యూ చేయడం మానుకోవాలని ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారట. మరి రాజమౌలి దీనికి ఏం చెబుతారో చూద్దాం.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more