Nithya menon interview

Nithya Menon Interview, interview with nithya menon, actress nityamenon

Nithya Menon Interview, interview with nithya menon, actress nityamenon

నిత్యామీనన్ ఇంటర్యూ

Posted: 05/22/2013 05:15 PM IST
Nithya menon interview

ఇప్పటి కధానాయికలలో , మన తెలుగు లో ఒక ఇంపార్టెన్స్ ఉన్న హీరోయిన్ పాత్ర పోషించాలి అంటే , అది నిత్యా మీనన్ వల్లే అవుతుంది అని ముద్ర పడిపోయింది . తాను చేసిన సినిమాలు తక్కువే అయినా , చేసిన ప్రతీ సినిమా హిట్ కాకపోయినా , తన శైలిలో పాత్రలను ఎంపిక చేసుకుని , నటనను కొనసాగిస్తూనే ఉంది , నిత్యా మీనన్ '.జూనియర్ సౌందర్య 'అని బిరుదుని సంపాదించుకుని , 'గుండె జారి గల్లన్తయ్యిందే' తో ఇంకో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ నటీమణి , తన భావాలని పంచుకుందిలా....

'ఇష్క్' సూపర్ సక్సెస్ సాధించింది , మరి ఇదే పెయిర్ మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు టెన్షన్ అనిపించలేదా ?

టెన్షన్ ఎందుకు ? నేను సినిమాలు విజయం సాధిస్తాయా లేక ఫ్లాప్ అవుతాయా అని ఆలోచించి ఎంచుకొను . పాత్ర బాగుండి , నాకు ఆ సినిమా చెయ్యాలనిపిస్తే చేస్తాను అంతే . 'అలా మొదలైంది ' నుండి 'గుండె జారి గల్లన్తయ్యిందే ' వరకు, అన్ని భాషలలో నేను చేస్తూ వస్తున్నా సినిమాలు ఇలా ఎంచుకున్నవే . పెయిర్ రిపీట్ అవుతుంది  ఈ సారి సక్సెస్ అవుతుందా ? అని నేను ఎప్పుడు ఆలోచించలేదు . కధ , పాత్ర నచ్చింది , చేసానంతే.

'గుండె జారి గల్లంతయ్యింది ' టైటిల్ వెనుక అసలు రహస్యం ???

కధ .. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటాం . హీరో గుండె ఎవ్వరిని చూసి గల్లంతయ్యింది అనేదే కధ ... ఇంతకు మించి ఇంకా చెప్తే కధ తెలిసిపోయి , ఇంకా చూడని వాళ్ళు సినిమా చూసే త్రిల్ మిస్ అవుతారు . అందుకే ముందు సినిమా చూస్తె , ఈ కధకు టైటిల్ యాప్ట్ గా సరిపోతుంది అని అనిపించక తప్పదు .

ఈ సినిమా' ఇష్క్ - 2 ' ఏమో అని వస్తున్న వార్తలపై మీరేమంటారు ?

నాకు , తెలిసి సినిమా చూసిన వారెవరు ఈ మాట అనరు . చూడని వారికి , 'ఇష్క్' లో నేను నితిన్ కలిసి నటించడం వల్ల 'గుండె జారి గల్లన్తయ్యిందే ' లో మళ్ళీ మేమే కలిసి నటించడం వల్ల ఇలా అనిపించడం సహజం . కాని ఈ సినిమా కధ , మా ఇద్దరి పాత్రలతో సహా , అందరి పాత్రలు తీర్చిదిద్దిన తీరు , అంతా కొత్తగా అనిపిస్తుంది . చూసిన వారు తప్పకుండ ఈ విషయం తో ఏకీభవిస్తారు . ఈ సినిమా అంతా కూడా ఎంతో అందంగా ఉంటుంది . క్యామెరామ్యాన్ కు ఇందుకు జోహార్లు . 'ఇష్క్' లో మా పెయిర్ చాల బాగుంది , సినిమా కూడా విశువల్ గా చాలా బాగుంది అన్న వారు , ఈ సినిమాలో మేమే కాక , సినిమా అంతా కూడా చూడచక్కగా ఉంటుంది అనక మానరు .

సినిమాలో మీ వేషధారణ

సాధారణంగా నేను చేసే ప్రతీ సినిమాలో నా వేషధారణ విన్నూత్నంగా ఉండటానికి ఇష్టపడతాను . సినిమా సినిమాకి పొంతన ఉండటం పాత్ర నుండి వేషధారణ వరకు కూడా , నాకు అంతగా ఇష్టం ఉండదు . కాని ఈ సినిమాకి , నా పాత్ర యెంత కొత్తగా తీర్చి దిద్దారో , వేషధారణలో కూడా అంతే మార్పులు చేసారు . పాటల్లో కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది నా డ్రెస్సింగ్ . సినిమా మొత్తం పర్ఫెక్ట్ గా రావడానికి , అన్ని విభాగాలనీ దృష్టిలో పెట్టుకుని , పూర్తీ స్థాయిలో కష్టపడ్డాం . విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం టీం అంతా కూడా .

వరుసగా రెండు సినిమాలు నితిన్ తో ... ఇంకో సినిమా అవకాసం వస్తే నటిస్తారా?

తప్పకుండా ... నేను ఇంతకు మునుపే చెప్పినట్టుగా , ఒకే హీరోతో , టీం తో వరుసగా సినిమాలు చేస్తున్నానా ? ఈ కాంబినేషన్ హిట్ గానే నిలుస్తుందా , లేక ఫ్లాప్ అవుతుందా అని నేను ఎప్పుడు ఆలోచించను . మంచి కధ , పోషించగల , కధలొ గుర్తింపు ఉన్న పాత్రతో నా దగ్గరికి వస్తే ఇక ఏమి ఆలోచించకుండా , ఎవరి తో అయినా , ఏ భాష అయినా నటించడానికి సిద్ధం .

ఈ సినిమాలో కూడా గొంతు సవరించుకున్నారు గా ???

నా పాత్ర కు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది నా తోలి సినిమా నుండి చేస్తున్న పనే . మన పాత్రకు మనమే గాత్ర దానం చేస్తే , పాత్రకు 100 % న్యాయం చేసిన వారవుతాం అనేది , నేను నా తోలి సినిమా నుండి పాటిస్తూ వస్తోన్న సిద్ధాంతం . ఇక పాట పాడటం అనేది , నా తోలి సినిమా దర్శకురాలు నందినీ రెడ్డి , సంగీత దర్శకులు కళ్యాణ్ మాలిక్ గార్లు నా చేత చేయంచిన పని . యాద్రుచికంగా అది అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది . ఈ సినిమాలో కూడా 'తుహీ రే ' అనే పాట పాడాను . అనూప్ రుబెన్స్ వంటి మంచి సంగీతాభిరుచి ఉన్న దర్శకుడి వద్ద పాడటం నాకు మరచిపోలేని అనుభవం .

తరువాతి సినిమాలు ???

ప్రస్తుతం 'గుండె జారి గల్లన్తయ్యిందే ' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను . తరువాతి సినిమా ఏంటో త్వరలోనే మీకే తెలుస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more