Nag greeku veerudu interview

greekuveerudu, greeku veerudu trialer, greeku veerudu teaser, greeku veerudu promo, greeku veerudu first look, greeku veerudu songs, nagarjuna, nagarjuna movive

greekuveerudu, greeku veerudu trialer, greeku veerudu teaser, greeku veerudu promo, greeku veerudu first look, greeku veerudu songs, nagarjuna, nagarjuna movive

నాగార్జున గ్రీకువీరుడు ఇంటర్యూ

Posted: 05/15/2013 05:40 PM IST
Nag greeku veerudu interview

ఈ 'గ్రీకు వీరుడు' అమృతం తాగాడా ???

తెలుగు సినీ పరిశ్రమ లో నేటికీ ఏనాటికీ 'గ్రీకు వీరుడు' అంటే కింగ్ నాగార్జునే . తన తరువాతి తరం వారికి కూడా గట్టి పోటీ ఇస్తున్న ఈ హీరో లేటెస్ట్ హిట్ 'గ్రీకు వీరుడు' గురించి నాగ్ చెప్పిన విశేషాలు ;

గ్రీకువీరుడిగా నాగ్ మారడం

మిగితా హీరోల కన్నా నేను ప్రయోగాలు ఎక్కువగా చేస్తాను అని ... ఇందుకు నిదర్సనం , ఈ మధ్యనే విడుదల అయిన 'రగడ' నుండి 'గగనం' , 'రాజన్న', 'షిరిడి సాయి' , 'ఢమరుకం', ఇంతకంటే ముందు ఎన్నో సినిమాలు ఇక ఇప్పుడు 'గ్రీకు వీరుడు' అంటారు అంతా... నిజమే సినిమా సినిమాకి పొంతన లేకుండా , నా పాత్ర దగ్గరి నుండి సినిమా కధ వరకు ప్రతీ విషయం విన్నూత్నంగా ఉండటం నాకు ఇష్టం . నాతొ 'సంతోషం' వంటి విజయవంతమైన సినిమా తీసిన దసరధ్ , 'గ్రీకు వీరుడు' కధ తో నా దగ్గరికి వచ్చినప్పుడు , తప్పకుండా ఈ సినిమా చేద్దాం అని మొదలు పెట్టాం . నా సొంత నిర్మాణ సంస్థ వంటి 'కామాక్షీ మోవీస్' వారు ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు . ఈ సినిమాలో నా పాత్రను బట్టి , ఒక ఖచ్చితమైన వ్యాపారవేత్త , పక్కాగా వ్యాపారం లో విజయమే ప్రధానం , కుటుంబ విలువలు , ప్రేమ వంటి ఎమోషన్స్ కి ఏ మాత్రం విలువ ఇవ్వని వ్యక్తీ పాత్రలో నేను కనిపిస్తాను కాబట్టి, వేషధారణ దగ్గరినుండి , డైలాగ్లు చెప్పే తీరు , బాడీ లాంగ్వేజ్ వరకు నేను - దసరధ్ కలిసి ఎన్నో మార్పులే చేసాం . ఈ రోజు చిత్రం విడుదల అయిన తరువాత అందరు నా పాత్రని మెచ్చుకుంటూ ఉంటె , స్వీకరిస్తూ ఉంటె చాలా ఆనందంగా ఉంది .

దసరధ్ గురించి ...

చాలా క్లెరిటీ ఉన్న దర్శకుడు దసరధ్ ... ఓక్ లొకేషన్లో ఫలానా సీన్ షూట్ చేస్తున్నప్పుడు  తనకు ఇదే షూటింగ్ స్పాట్ లో చిత్రంలో వచ్చే ఇంకో సన్నివేశం తీయచ్చు అని స్ట్రైక్ అయితే , 'కాస్త డ్రెస్ చేంజ్ చేసుకుని రండి ' అని చెప్పి ఆ షాట్ కూడా తీసేస్తాడు . అంటే సినిమా మొత్తం , మొదటి నుండి చివరి షాట్ వరకు తన బ్రెయిన్ లో ఫీడ్ చేసుకునేంత క్లెరిటీ దసరధ్ కి ఉంది . అందుకే 'సంతోషం' సినిమా కధ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక దర్శకుడు చెప్పే స్టయిల్ లో దసరధ్ కధ చెప్తే , 'ఇతనే ఈ సినిమాని ఎందుకు డైరెక్ట్ చెయ్యకూడదు?' అని దసరధ్ కి అవకాసం ఇచ్చాం . అప్పుడు కూడా, తాను దర్శకత్వం వహించగలనా అని నిర్ణయించుకోడానికి 3 రోజులు సమయం తీసుకుని మరీ ఒకే చెప్పిన దసరధ్ ఆలోచనా తీరు నన్ను అమితంగా ఆకర్షించింది . ఒకొక్క దర్శకుడికీ ఒక్కో ఐడెంటిటీ , అలాగే దసరధ్ సినిమా అంటే , ఫ్యామిలీ ఎమోషన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే . అందుకే అన్ని ఎమోషన్స్ మిళితమైన 'గ్రీకు వీరుడు' అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది .

తమన్ సంగీతం

సినిమా కి ఒక వరం . దసరధ్ యెంత అద్భుతంగా తాను అనుకున్న కధని తెరమీద చూబించి , మేమంతా యెంత బాగా నటించినా , సంగీతం కూడా తోడయ్యి చిత్ర విజయానికి దోహదపడింది . సాహిత్యం - సంగీత విలువలు ముఖ్యంగా ఈ చిత్రం లో గమనిస్తే , ప్రతీ పాట సందర్భోచితంగా ఒచ్చి , చిత్ర కధను ముందుకు తీసుకువెళ్లేదే ... 'ఐ హెట్ లవ్ స్టోరీస్' పాట కూడా కధానాయకుడి గురించి చెప్పేదే ... తమన్ మరోసారి తన టాలెంట్ చాటుకున్నాడు .

నయనతార పాత్ర

చిత్రానికి ఎంతో కీలకం . హీరోతో సమానంగా ఉంటుందీ పాత్ర . హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే , హీరోయిన్ ఆలోచనా విధానం కూడా అంతే స్పష్టంగా చూబించాలి . అందుకు దసరధ్ హీరోయిన్ పాత్రను ఎంతో చక్కగా మలిస్తే , నయనతార వంటి నటి ఈ పాత్రకు 100 % న్యాయం చేసింది ... మొత్తానికి అందరూ కలిసి 'గ్రీకు వీరుడు ' ని విజయ పధం వైపు నడిపించి , మరిన్ని నూతన ప్రయత్నాలు నేను చెయ్యడానికి కొత్త ఉత్సాహం ఇచ్చారు .

'గ్రీకు వీరుడు' గా అలరిస్తున్న నాగ్ త్వరలో 'భాయ్' గా ఎంతర్టేయిన్ చెయ్యడానికి మన ముందుకు వస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more