Interview with actoress geeta singh

Chit Chat with Geeta Singh, Geeta Singh, Actress Geeta Singh, Live Chit Chat Show, kitakitalu, geeta singh, interview, telugu, telugu movies, telugu songs, telugu masala songs, telugu sexy songs, telugu hot songs, telugu babes, heroines,geeta singh, telugu cinema tun tun, comedian geeta singh, allu arjun, mahesh babu

Interview with Geeta Singh, of Kitakitalu fame. Tollywood Comedy Actress Geeta Singh - shares is views and Experiences with Andhrawishesh.com

Interview with Geeta Singh.GIF

Posted: 04/11/2012 12:19 PM IST
Interview with actoress geeta singh

geeta_interview

‘జై’ సినిమాతో కెరీర్‌ని ప్రారంభించిన ఆమె ‘ఎవడి గోల వాడిదే’తో గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అంటే నాజూగ్గా

Geeta_Singh

ఉండాలన్న అభిప్రాయాన్ని తుడిచేస్తూ తెలుగు ప్రేక్షకులకు ‘కితకితలు’ పెట్టింది. చక్కని కామెడీతో కడుపుబ్బ నవ్వించే అతి కొద్దిమంది లేడీ కమెడియన్స్‌ లో ఒకరిగా చెప్పుకోదగ్గ ఆ నటి... గీతాసింగ్. లావుగా ఉండటమే తనకు ప్లస్సు, మైనస్సు కూడా అంటూ గీత చెప్పిన ముచ్చట్లు...

మీ బ్యాగ్రౌండ్...?

నిజానికి నేను రాజస్థానీ అమ్మాయిని. కానీ మా పూర్వీకులు నిజామాబాద్‌లో సెటిలైపోవడంతో అక్కడే పుట్టి పెరిగాను.

నటిగా మారిన వైనం...?

మొదట్నుంచీ నటన మీద ఆసక్తి ఉంది. కాలేజీ ప్రోగ్రాముల్లో డ్యాన్స్ చేసేదాన్ని. హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు ‘జై’ సినిమాకి కొత్త నటీనటుల్ని తీసుకుంటున్నారని తెలిసింది. దర్శకుడు తేజగారిని చూడటం కోసమే ఆడిషన్‌కి వెళ్లాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను.

హీరోయిన్ అవుతానని అనుకున్నారా?

అస్సలు అనుకోలేదు. మొదట ఈవీవీ గారితో ‘ఎవడి గోల వాడిది’ చిత్రానికి పని చేశాను. అప్పుడాయన త్వరలోనే నా సినిమాలో ఓ మంచి పాత్ర చేయబోతున్నావని చెప్పారు. అయితే అది ఏకంగా హీరోయిన్ పాత్ర అని నాకప్పుడు తెలీదు. తెలిసిన తర్వాత కలిగిన ఫీలింగ్..?
ఈవీవీ పిలిచి ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అంటే నేనసలు నమ్మలేదు. ఏదో జోక్ చేస్తున్నారనుకున్నాను. నిజమని తెలిశాక కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు.

లావుగా ఉండటం వల్లే ఆ అవకాశం వచ్చిందా?

కావచ్చు. అయితే దానితోపాటు అమాయకంగా కనిపించే అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నారట. నిజానికి ఆ పాత్ర కోసం నేను ఉన్నదానికంటే మరింత లావు కావాల్సి వచ్చింది. దానికోసం రోజుకు ఆరుసార్లు భోంచేశాను. స్వీట్లు బాగా తిన్నాను. ఆ పాత్రకు సరే. లావుగా ఉండటం తర్వాత మైనస్ కాలేదా?
ఎంతమాత్రం లేదు. నా పాత్రలు నాకు వచ్చాయి. లావుగా ఉన్నందువల్ల నాకు అవకాశాలు రాకుండా పోలేదు.

బయట కనిపిస్తే అభిమానుల స్పందన...?

చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. కొందరైతే ‘బాగానే ఉన్నారు కదండీ. సినిమాల్లో అంత లావుగా కనిపిస్తారేంటి’ అని అడుగుతుంటారు. ‘నిజమా. అయితే వెంటనే ఇంటికి వెళ్లి భోం చేస్తా’ అని నవ్వేస్తుంటాను. అయితే కొంతమంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ‘అదిగోరా ఆ సినిమాలో బండమ్మాయి. ఇంత ఒళ్లు పెట్టుకుని ఎలా చేస్తోందో’ అని కామెంట్ చేస్తుంటారు. కాస్త బాధనిపిస్తుంది కానీ పోతే పోనిమ్మని వదిలేస్తుంటాను.

నటిగా మీ రోల్ మోడల్ ఎవరు?

సీనియర్ నటీనటులంతా నా రోల్‌మోడల్సే. వాళ్లందరి నుంచీ నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, రమ్యకృష్ణల నటనంటే ప్రత్యేకమైన ఇష్టం నాకు.

మీ ప్లస్/మైనస్ పాయింట్స్?

రెండూ లావుగా ఉండటమే. ఎందుకంటే కామెడీ పాత్రలు చేయడానికి ఈ లావు అదనపు లాభమైతే, హీరోయిన్‌గా చేయడానికి అదే మైనస్!

ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

సురేఖావాణి. కోవై సరళ. వాళ్లిద్దరూ నన్ను చాలా అభిమానంగా చూస్తారు. ఇలా చెయ్యి, అలా చేస్తే బాగుంటుంది అంటూ సలహాలిస్తారు.

geetha-singhపెళ్లి ప్రయత్నాలు...?

చేస్తున్నాను. ఇంకా కుదరలేదు. (నవ్వుతూ) మహేష్‌లా అందంగా ఉండాలి, నరేష్‌లా నవ్వించాలి, నాగార్జునలా స్టైల్‌గా ఉండే వాడు కావాలి లాంటి కోరికలు అందరికీ ఉంటాయి. కానీ దొరకాలిగా. అందుకే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు.ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుంది?
‘కర్తవ్యం’లో విజయశాంతి, ‘చంద్రముఖి’లో జ్యోతిక పాత్రలు చాలా ఇష్టం. అలాంటివి చేయాలనుకుంది. (నవ్వుతూ) కానీ కుదరాలి కదా!

భవిష్యత్ ప్రణాళికలు...?

రచ్చ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నాను. అది చేయాలి, ఇది చేయాలి అనే అంచనాలేమీ లేవు. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగిపోవాలనుకుంటున్నాను.

‘కితకితలు’లో నేనే హీరోయిన్ని అని ఈవీవీ చెప్పిన క్షణాన్ని జీవితంలో మర్చిపోలేను. నేను అత్యంత సంతోషపడిన సందర్భమది. కానీ దురదృష్టవశాత్తూ అత్యంత బాధ కలిగించిన సందర్భం కూడా ఈవీవీతోనే ముడిపడి ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. నాకంటూ ఓ గుర్తింపునిచ్చిన ఆయన ఇప్పుడు లేరన్న నిజాన్ని భరించడం కష్టంగా ఉంది. ప్రతి యేడూ ఆయన బర్త్‌ డేకి రకరకాల స్వీట్లు తీసుకెళ్లేదాన్ని. ఆయన మాత్రం లడ్డూయే తీసుకునేవారు. అప్పుడు ఆయన భార్య... ‘ఏమ్మా.. ఆయన్ని కూడా నీలా లడ్డూలా చేద్దామనా లడ్డూలు తెచ్చావ్’ అనేవారు. అవన్నీ గుర్తొస్తే ఏడుపొస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more