Venkatesh birthday chit chat

venkatesh, chit chat, bodyguard,Bodyguard, bodyguard audio, bodyguard telugu movie, bodyguard movie audio, venkatesh bodyguard, venkatesh, venkatesh birthday, trisha, bodyguard audio release date

Venkatesh’s Bodyguard film is gearing up for Pongal release. This film is the remake of successful Malayalam by the same name. Gopichand Malineni is the director and Bellamkonda Suresh produces it.

Venkatesh birthday chit chat.gif

Posted: 12/13/2011 05:45 PM IST
Venkatesh birthday chit chat

Venkatesh_interview

Venkatesh"నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే'' అని చెప్పారు హీరో వెంకటేశ్. వెంకటేశ్ జన్మదినం. ఈ సందర్భంగా జీవితం పట్ల తన ఆలోచనలూ, అభిప్రాయాల గురించీ విపులంగా చెప్పారు.
అవేమిటో ఆయన మాటల్లోనే... 'బాడీగార్డ్' వచ్చిన తీరుకి చాలా హ్యాపీగా ఉన్నా. జనవరి 12న రిలీజ్. సంక్రాంతికి మంచి ఆల్‌రౌండ్ సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ డ్రామా, చక్కని సంగీతం ఉన్నాయి. తమన్ చాలా బాగా సంగీతం ఇచ్చాడు. తొలిసారి అతనితో కలిసి పనిచేశా. ఇతర సినిమాలకంటే ఎక్కువగా దీన్ని సంగీతభరిత చిత్రం చేశాడు. అతనిచ్చిన నేపథ్య సంగీతం గురించి కూడా చెప్పుకుంటారు.
తదుపరి చిత్రాలు :

ఈ నెల 16 నుంచి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్‌లో పాల్గొనబోతున్నా. ఇది చాలా చక్కని చిత్రం. చాలా రోజుల తర్వాత ఓ అందమైన ఫ్యామిలీ ఫీల్‌తో, ఇద్దరు అన్నాతమ్ముళ్ల జీవిత ప్రయాణంతో, వాళ్ల ఎత్తుపల్లాలతో రాబోతున్న చిత్రం. నేను, మహేశ్ కలిసి చేయడానికి ఉద్వేగంతో ఎదురుచూస్తున్నాం. దీని తర్వాత మల్టీస్టారర్స్ పెరుగుతాయని ఆశిస్తున్నా. సంవత్సరానికి ఒకటాన్నా వస్తే బాగుంటుంది. దీనితో పాటు మెహర్ రమేశ్‌తో బాగా స్టయిలిష్‌గా ఉండే యాక్షన్ ప్రధాన చిత్రం చేయబోతున్నా. అందులో ఫ్యామిలీ డ్రామానీ, వినోదాన్ని చాలా తెలివిగా మేళవించాడు రమేశ్. ఆల్‌రౌండ్ సాలిడ్ కమర్షియల్ అప్పీల్‌తో ఉంటుంది. 'సీతమ్మ వాకిట్లో..' తర్వాత నాకు వైవిధ్యమైన సినిమా అవుతుంది. 'వివేకానంద' 2012 ద్వితీయార్థంలో మొదలవుతుంది. మణిశంకర్ దర్శకుడు. స్క్రిప్టు సిద్ధమయింది.
'బొబ్బిలి రాజా' సీక్వెల్ ' :

బొబ్బిలి రాజా'కి సీక్వెల్ చేయాలంటే ఇవాళ చాలా నియమ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఆ సినిమాలో చాలా జంతువులు ఉంటాయి. నిజమైన జంతువులతో చేయాలంటే చాలా పర్మిషన్లు తెచ్చుకోవాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. వాటిని సడలిస్తే చేయొచ్చు. అందులో రానా కూడా చేస్తానంటున్నాడు సరదాగా.
రానాకే ఎక్కువ తెలుసు :

రానా ఊరంతా తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. తెలుగు, తమిళం, హిందీల్లో చేస్తున్నాడు. వాడు కష్టజీవి. నాకన్నా ఎక్కువ సినిమా తపన ఉన్నవాడు. నిజంగా చెప్పాలంగా నాకన్నా సినిమా గురించి ఎక్కువ తెలుసు. చిన్నప్పట్నించీ సినిమా గురించి నేర్చుకుంటూ వస్తున్నాడు. సాంకేతికంగా సినిమా గురించి అధ్యయనం చేయడం గానీ, సినిమాకు సంబంధించిన పుస్తకాలు చదవడం గానీ నాకంటే ఎక్కువ చేస్తుంటాడు. చాలామందితో కలుస్తుంటాడు. ఇది ఆరోగ్యకరమైన విషయం. ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. ప్రయోగాల కోసం తాపత్రయపడుతుంటాడు. దానివల్ల ప్రతిభ కూడా పెరుగుతుంటుంది. ఇప్పట్లో వాడూ, నేనూ కలిసి సినిమా చేసే అవకాశం లేదు.
అర్జున్ చిన్న పిల్లాడు :

మా అబ్బాయి అర్జున్ చాలా చిన్న పిల్లాడు. మూడో గ్రేడ్ చదువుతున్నాడు. అప్పుడే సినిమాలెందుకు? ఈ మధ్య స్కూల్లో ఓ ఎగ్జామ్‌కి సరిగా ప్రిపేరయినట్లు లేడు. దాంతో దిగాలుపడ్డాడు. నేనూ, మా ఆవిడా 'అదేమీ కంపల్సరీ కాదు కదా. రాయొద్దులే' అని చెప్పాం. కారులో కూర్చున్నాక "డాడ్. ఫియర్ ఈజ్ ద డార్క్‌సైడ్ ఆఫ్ ద పాత్'' అన్నాడు. అదేదో హాలీవుడ్ సినిమాలో డైలాగ్ అంట. వెళ్లి ఎగ్జామ్ రాశాడు. వాడికి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. పిల్లలు సహజంగా పెరగాలి. నిబంధనలు ఉండకూడదు. అన్నీ చేస్తుండాలి. సినిమాల్లో చెయ్యాలని వాడికి ఉంది. 'కరాటే కిడ్' చేస్తానంటున్నాడు.
వివాదాల్లో తప్పు లేదు ఏదో జన్మలో అంతా అయిపోయుంటుంది. అందుకే ఈ జన్మలో ఎలాంటి వివాదాలూ లేకుండా జీవితం సాగించగలుగుతున్నా. వివాదాల్లో చిక్కుకోవడంలో తప్పేమీ లేదు. అది శక్తినిస్తుంది. బహుశా నేను వాటికి ఎట్రాక్ట్ కాలేదేమో.
లక్ష్యాలు ఉండవు :

నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే. జీవితంలో మనం ఏదన్నా కండిషన్ పెట్టుకుంటే ఆ రోజు నుంచే మన జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. అది ఎవరు నేర్పించారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం అది సూటవదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం తెలుసు కానీ, ఈ లక్ష్యాలనేవి నాకు తెలీదు. ఓ లక్ష్యం అనేది పెట్టుకొని అది సాధించగానే, మళ్లీ ఇంకో లక్ష్యం పెట్టుకోవడం... ఈ పద్ధతికి నేను దూరం. ఇవన్నీ పెట్టుకొంటే ఇక ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఈ సంగతి తెలుసుకుంటే జీవితం చాలా సింపుల్‌గా ఉంటుంది. జీవితాన్ని వృథా చేయకూడదు. ఎన్నో చేస్తుంటాం. టైమ్ లేనట్లు ఉరుకులు పరుగులు పెడుతుంటాం. కానీ మన ఆరోగ్యం గురించి మనం ఓ అరగంట కేటాయించుకోం. జీవితంలో నిజమైన ఎమర్జన్సీ అనేది ఒకటే ఉంటుంది. అది మన చివరిదశ. అది తెలుసుకోకపోవడం మనం చేసే అతి పెద్ద తప్పు.
ఆలోచనా విధానం మారాలి :

సమస్యలు ఉండని మనుషులు ఉండరు. దేవుడికి కూడా సమస్యలే. సమస్య నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ప్రధానం. సంతోషమనేది మానవుడికి ఎప్పుడూ ఉండదు. అది తెలుసుకుంటే ఆలోచనా విధానం మారుతుంది. జీసస్ కానీ, బుద్ధుడు కానీ, రాముడు కానీ, మహ్మద్ ప్రవక్త కానీ మనలాగే మనుషులు. వాళ్లు అందరూ ఆరాధించే స్థాయిలో ఎందుకున్నారు, మనం ఇలా ఎందుకున్నాం అని ఆలోచించుకోవాలి. అందరం అత్యున్నత స్థాయికి అర్హులమే. సమర్థులమే. ఆలోచనా విధానమే మారాలి. మనకీ, వాళ్లకీ అదే తేడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more