Varalakshmi Sarathkumar’s ‘Chasing’ is Ready to Release విడుదలకు సిద్దమౌతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ‘చేజింగ్’

Varalakshmi sarathkumar s chasing completes dubbing getting ready for release

Chasing, Varalakshmi, Police officer, Sarathkumar, Antagonist roles, Telugu audience, Tamil super hit, K. Veerakumar, Thasi, Orey Bammardhi, My Dear Bhootham, AN Balaji, Sri Lakshmi Jyothi Creations, Tollywood, movies, Entertainment

Varalakshmi Sarath Kumar entered the film industry as the daughter of senior hero Sarathkumar and created a mark for herself on the silver screen. She stole the hearts of the Tamil and Telugu audiences by playing positive as well as negative roles. Now she is coming to entertain the Telugu audience with another different concept movie Chasing.

విడుదలకు సిద్దమౌతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ‘చేజింగ్’

Posted: 09/16/2022 04:28 PM IST
Varalakshmi sarathkumar s chasing completes dubbing getting ready for release

వరలక్ష్మి శరత్ కుమార్ అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుని.. రాణిస్తున్న నటి. కాలీవుడ్ నటుడు, నిన్నటితరం హీరో శరత్ కుమార్ తనయగా సినీరంగంలో ప్రవేశించిన ఆమె.. ఇప్పుడు తనకంటూ ఓ చక్కని గుర్తింపును తెచ్చుకుని దూసుకుపోతోంది. విలక్షణమైన పాత్రలను వేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటోంది. ఇక తాజాగా అమె చేజింగ్‌ అన్యాయాలను ఎదిరించడానికి సిన్సియర్‌ పోలీసాఫీసర్‌గా అవతారం ఎత్తుతున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చేజింగ్‌’.

తమిళంలో ఇప్పటికే విడుదలై మంచి హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఏఎన్‌ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘మా బేనర్లో ‘ఒరేయ్‌ బామ్మర్ది, మై డియర్‌ భూతం’ వంటి హిట్‌ చిత్రాలను అందించాం. ‘చేజింగ్‌’ మంచి యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఏఎన్‌ బాలాజీ అన్నారు. కె. వీరకుమార్‌ దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రాన్ని తమిళంలో ఆదరించిన ప్రేక్షకులు తెలుగులోనూ ఆదరిస్తారని చిత్రబృందం ఆశలు పెట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles