Tollywood editor Gautam Raju passes away ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు ఇకలేరు.. చిరంజీవి ఆర్థిక సాయం

Telugu film editor gowtham raju passes away at 68 tolly celebs pay tribute

gautham raju, editor, chiranjeevi, balakrishna, pawan kalyan, ram charan, nandmuri taraka ramarao, sai dharam tej, manchu vishnu, Gopichand, Harish Shankar, tammareddy bharadwaja, tollywood, Movies, Entertainment

Telugu film editor Gautham Raju passed away at 1:30 AM on Wednesday at his residence in Moti Nagar, Hyderabad. He was 68 and had passed due to age-related ailments. Reportedly, Gautham was undergoing treatment for a kidney-related ailment at a private hospital

ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు ఇకలేరు.. చిరంజీవి ఆర్థిక సాయం

Posted: 07/06/2022 03:56 PM IST
Telugu film editor gowtham raju passes away at 68 tolly celebs pay tribute

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డు అందుకున్న ఆయన చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటింగ్‌ ప్రారంభించారు.

గౌతంరాజు మృతిపట్ల టాలీవుడ్ న‌టులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజతోపాటు ప‌లువురు సినీ రంగ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించారు. గౌత‌మ్ రాజుతో చిర‌కాల అనుబంధం ఉన్న చిరంజీవి త‌క్ష‌ణ సాయంగా ఆయ‌న కుటుంబానికి రూ.2 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గౌత‌మ్ రాజు కుటుంబానికి చిరంజీవి త‌ర‌పున త‌మ్మారెడ్డి భ‌రద్వాజ రూ.2 ల‌క్ష‌లు అంద‌జేశారు. గౌత‌మ్ రాజు కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని చిరంజీవి భ‌రోసానిచ్చారు.

మొత్తం ఎనిమిది భాషల్లో 8 వందలకుపైగా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, అదుర్స్‌, ఊసరవెల్లి, బద్రీనాథ్‌, బలుపు, గోపాల గోపాల, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాయక్, రేసుగుర్రం, అల్లుడు శీను, పవర్, బెంగాల్‌ టైగర్, సౌఖ్యం, డిక్టేటర్‌, అఖిల్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, కాటమరాయుడు, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, విన్నర్‌, హైపర్‌, గౌతమ్‌నంద, టచ్‌ చేసి చూడు, పటేల్, ఇంటెలిజెంట్‌, సన్నాఫ్‌ ఇండియా, మోసగాళ్లు, రాజుగారి గది 3, లయన్‌, స్పీడున్నోడు, కిక్‌ 2, పిల్లా నువ్వు లేని జీవితం వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles