Taapsee Pannu as Mithali Raj Shabaash Mithu Teaser Out! ఉత్కంఠ రేపుతున్న ‘శబాష్ మిథు’ టీజర్

Taapsee pannu brings indian cricketer mithali raj to big screen in shabaash mithu teaser

Shabaash Mithu teaser, Shabaash Mithu, Taapsee Pannu, Mithali Raj, Mithali Raj records, Taapsee Pannu, Shabaash Mithu, Shabaash Mithu Teaser, Bollywood, TV, Instagram, Taapsee Pannu Film, Taapsee Pannu News, Taapsee Pannu Upcoming Film, Shabaash Mithu Film, Shabaash Mithu News, Mithali Raj, Bollywood, movies, Entertainment

The teaser for Taapsee Pannu’s Shabaash Mithu has just dropped. The film is based on cricketer Mithali Raj, who has shattered many records, and is the captain of the Indian Women’s cricket team. The teaser emphasises the achievements of the women’s cricket team as well as the illustrious cricketer.

ఉత్కంఠ రేపుతున్న ‘శబాష్ మిథు’ టీజర్: మిథాలీరాజ్ గా తాప్సీ..

Posted: 03/21/2022 08:49 PM IST
Taapsee pannu brings indian cricketer mithali raj to big screen in shabaash mithu teaser

క‌ల్పిత క‌థ‌ల‌తో పాటు నిజ‌జీవిత క‌థ‌లు కూడా ఈమ‌ధ్య కాలంలో బాగా రూపొందుతున్నాయి. ప్ర‌స్తుతం నిజ‌జీవిత సినిమాల‌కు ప్రేక్ష‌కుల‌లో ఆద‌ర‌ణ పెరిగింది. నిజ‌జీవిత క‌థ‌లు అన‌గానే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ బ‌జ్ ఎర్ప‌డుతుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా నిజ‌జీవిత క‌థ‌ల‌ను బేస్ చేసుకుని సినిమాల‌ను తెర‌కెక్కించాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అలా క్రికెట‌ర్ల‌ నిజ‌జీవిత క‌థ‌లు సినిమాలుగా తెర‌కెక్కి బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాకుండా.. విమ‌ర్శ‌కుల నుంచి కూడా గొప్ప ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి. అందులో’M.S ధోని:ది అన్‌టోల్డ్ స్టోరి’,’ 83′ చిత్రాలు ముందు వరుస‌లో ఉంటాయి. తాజాగా మ‌రో క్రికెట‌ర్ క‌థ తెర‌మీద‌కు రావ‌డానికి సిద్ధ‌మైంది.

భార‌త మహిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ‘శ‌భాష్ మిథు’. శ్రీజిత్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంలో తాప్సీ మిథాలీరాజ్‌గా న‌టించ‌నుంది. ఇదివ‌ర‌కే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ఈ సినిమాపై మంచి అంచాల‌ను నెల‌కొల్పాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజ‌ర్ విడుద‌లైంది. ఈ టీజ‌ర్ ఆధ్యాంతం ఆక‌ట్టుకుంటుంది. వ‌రుసగా ఏడు హాఫ్ సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా మిథాలీ రాజ్‌ను ప‌రిచ‌యం చేస్తూ నాలుగు సార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ కెప్టెన్‌గా.. అతి చిన్న వ‌య‌సులోనే టెస్ట్‌లో 200 చేసిన క్రికెట‌ర్‌గా టీజ‌ర్‌లో మిథాలి రికార్డుల‌ను చూపించారు . స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని వ‌యాకామ్ 18స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles