Ram Charan and Shankar film Concept poster రామ్ చరణ్-శంకర్ చిత్రం ప్రారంభం.. కాన్సెప్ట్ ఫోస్టర్..

Shankar next directorial starring ram charan kiara advani goes on floors

Megapower star, Ram Charan, Kiara Advani, Shankar, Ram Charan, dil raju, Kiara Advani, Sunil, Anjali, Naveen Chandra, Jayaram, Jani Master, ss rajamouli, Alia Bhatt, Ajay Devgan, RC15 update, S Thamman, RC15 update, Tollywood

Actors Ram Charan and Kiara Advani's upcoming film directed by Shankar went on the floors on Wednesday at Annapurna Studios in Hyderabad. Dil Raju, who is co-producing the film under his banner Sri Venkateswara Creations, announced the news with the film's concept poster on his Twitter handle.

లాంఛనంగా రామ్ చరణ్-శంకర్ చిత్రం ప్రారంభం.. కాన్సెప్ట్ ఫోస్టర్..

Posted: 09/08/2021 11:39 AM IST
Shankar next directorial starring ram charan kiara advani goes on floors

టాలీవుడ్ అగ్రహీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషనల్లో వస్తున్న భారీప్రాజెక్టు ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమాలకు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మెగాపవర్ స్టార్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమా ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మెగా ఫాన్స్ ను బాగా అలరిస్తోంది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, మరో హీరోయిన్ అంజలి, హీరో నవీన్ చంద్ర, జయరాం సహా పలువురు కనిపిస్తున్నారు. వీరితో పాటు ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు ఎస్ తిరునవుక్కరసు, సాయి మాధవ్ బుర్ర, హర్షిత్ రెడ్డి, రామకృష్ణ, మౌనిక నిగోట్రే, రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరాం, నరసింహారావు సహా అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megapower star  Ram Charan  Kiara Advani  Shankar  RC 15  Dil Raju  S Thamman  RC15 update  Tollywood  

Other Articles