Kanabadutaledu Trailer: Too Mysterious!.. ‘కనబడుటలేదు’ అంటూ ఈ నెల 13న వచ్చేస్తున్నాడు..

Kanabadutaledu trailer racy intriguing

Sunil, Vaishaliraj, SukranthVeerella, Himaja, Yugram, Praveen, Ravi Varma, Kireeti Damaraju, kancharapalemkishore, kanabadutaledhu, kanabadutaledhu movie, kanabadutaledhu trailer, kanabadutaledu trailer, Balaraju.M, Madhu PonnasTollywood, movies, Entertainment

Sunil's crime thriller movie Kanabadutaledu is all set for theatrical release on 13th of this month. Meanwhile, the film's theatrical trailer has been unveiled. The plot revealing trailer looks racy and intriguing as every character appears mischievous. It's a triangular love story and the guy whom the girl in love with goes missing and everyone looks suspicious.

ఆసక్తిరేపుతున్న ‘కనబడుటలేదు’ టీజర్.. సస్పెన్స్ థ్రిల్లర్

Posted: 08/09/2021 06:47 PM IST
Kanabadutaledu trailer racy intriguing

ఒక వైపున కీలకమైన పాత్రలతో .. మరో వైపున ప్రధానమైన పాత్రలతో సునీల్ ఒక కొత్త రూట్లో వెళుతున్నాడు. అలా ఆయన తాజాగా చేస్తున్న సినిమానే 'కనబడుటలేదు'. నిన్న ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ .. ప్రేమికులు ఇల్లు వదిలి పారిపోవడానికి ప్రయత్నించడం .. ప్రేమికుడు కనిపించకుండా పోవడం .. ఆ కేసు డిటెక్టివ్ రామకృష్ణ చేతికి రావడం వంటి అంశాలతో ట్రైలర్ కొనసాగింది.

ఈ కేసు టేకప్ చేసిన వారు ఆ తరువాత అదృశ్యం కావడం, డిటెక్టివ్ రామకృష్ణను కలవరపెడుతుంది. దాంతో ఆయన ఆ కేసును ఎలా డీల్ చేయాలా అనే విషయంలో రకరకాల ఆలోచనలు చేయడం మొదలుపెడతాడు. ఆ కేసు పరిశోధనలో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే ఉత్కంఠ భరితమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.    

సస్పెన్స్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ కలిపితీసినట్టుగా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు. స్పార్క్ సంస్థవారు నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా బాలరాజు పరిచయమవుతున్నాడు. రవివర్మ .. ప్రవీణ్ .. కిరీటి ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎక్కువగా నూతన నటీనటులే కనిపిస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanabadutaledhu  Sunil  Vaishaliraj  SukranthVeerella  Himaja  Balaraju.M  Madhu Ponnas  Tollywood  

Other Articles