Melody video song from Teja Sajja's 'Ishq' విడుదలకు రెడీ అవుతున్న తేజ సజ్జ ‘ఇష్క’

Melody video song from priya prakash varrier and teja sajja s ishq

teja sajja ishq not a love story, teja sajja ishq release date, teja sajja news, teja sajja latest news,Ishq Not A Love Story, Sai Tejja, teja sajja, ishq not a love story, release date, priya prakash warrior, SS Raju, Super good Films, Tollywood, Movies, Entertainment

Actor Sai Tejja is back to entertain all of us next week with his new movie 'Ishq Not A Love Story'. The makers are leaving no stone unturned to promote the film to woo audience to theatres. As the film is slated for release next week on July 30, Teja Sajja is busy with movie promotions.

విడుదలకు రెడీ అవుతున్న తేజ సజ్జ ‘ఇష్క’ నుంచి వీడియో సాంగ్

Posted: 07/24/2021 05:05 PM IST
Melody video song from priya prakash varrier and teja sajja s ishq

యంగ్ హీరో తేజ సజ్జ - కన్నుగీటు సుందరి ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా 'ఇష్క్ .. నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ నెల 30వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కరోనా రెండవ దశ తరువాత విడుదల కానున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఎలా వస్తాయన్నది వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎన్వీ  ప్రసాద్ .. పారస్ జైన్ .. వాకాడ అంజన్ కుమార్ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక హీరోహీరోయిన్లపై సాగిన చక్కని వీడియో సాంగ్ ను వదిలారు. 'ఆనందం మదికే ..' అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. బ్యూటిఫుల్ విజువల్స్ పై కట్ చేసిన ఈ పాట చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మెలోడీగా దీనిని చెప్పుకోవచ్చు.

ప్రియా ప్రకాశ్ వారియర్ కొంచెం ఒళ్లు చేసినట్టుగా ఉంది.. అమె ఎక్స్ ప్రెషన్లలో మాత్రం ఏ తేడా కనిపించలేదు. ఇక ప్రియాప్రకాష్ వారియర్ ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అవుతున్న రోజునే ఈ సినిమా వస్తుండటం విశేషం. 'జాంబి రెడ్డి'తో హిట్ అందుకున్న తేజ సజ్జ, ఈ సినిమాతోను సక్సెస్ ను సాధిస్తాడని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Priyanka arul mohan to star alongside dhanush in captain miller

    స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

    Sep 21 | ‘గ్యాంగ్‌లీడ‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. మొద‌టి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ‘డాక్ట‌ర్’, ‘డాన్‌’, ‘ఈటీ’ వంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌రింత చేరువైంది.... Read more

  • Comedian raju srivastava passes away at 58 weeks after being on ventilator

    ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

    Sep 21 | ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్... Read more

  • Harsh varrdhan kapoor s abhinav bindra biopic to finally go on floors

    అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

    Sep 16 | స్పోర్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత‌క‌థ‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రావ‌డం కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో క్రీడాకారుల జీవితాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ (2018-బీజింగ్)... Read more

  • Big announcement for karthi s fans sardar teaser and first single out

    కార్తీ స్ట‌న్నింగ్ లుక్‌తో ‘సర్థార్’ కొత్త అప్‌డేట్

    Sep 16 | కూల్ యాక్టింగ్‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కోలీవుడ్ న‌టుడు కార్తీ. ఈ హీరో ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ణిర‌త్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సెప్టెంబ‌ర్... Read more

  • Yash and ram charan to team up for director narthan next movie

    రాంచరణ్, యష్ లతో నార్త‌న్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం..?

    Sep 16 | ‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. కేజీఎఫ్‌తో క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్... Read more

Today on Telugu Wishesh