Special set erected for Prabhas 'Radhe Shyam' 'సాహో'ను మించిన ప్రభాస్ 'రాధేశ్యామ్' యాక్షన్ బడ్జెట్

Radhe shyam climax to be shot in sets worth rs 30 crores

Prabhas, pan India movie, Radhe Shyam, Pooja Hegde, final schedule, Action scenes, worth Rs 30 crores, Radhe Shyam movie, climax portion, Hollywood stunt master, Nick Powell, UV Creations, Justin Prabhakaran, Radha Krishna Kumar, Gladiator, Tollywood, Bollywood, movies, Entertainment

The shoot of Pan India movie Radhe Shyam is nearing completion. After the completion of the first schedule shooting of the film in Italy, the makers of the Prabhas and Pooja Hegde starrer are planning the final schedule in Hyderabad. It is said that sets worth Rs 30 crores are being erected for Radhe Shyam movie shoot and it will be used to complete the climax portion of Radhe Shyam.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ యాక్షన్ సన్నివేశాలకు అంత ఖర్చే.!

Posted: 11/12/2020 10:34 AM IST
Radhe shyam climax to be shot in sets worth rs 30 crores

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్తా బహుబలి సిరీస్ చిత్రాలతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దీంతో అతని సినిమాలంటే తెలుగు, తమిళ, కన్నడ, మళయాలంలోనే కాకుండా బాలీవుడ్ వ్యాపార వర్గాలలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకు నిదర్శనమే సాహో చిత్రం. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా.. కలెక్షన్లకు మాత్రం డోకా లేకుండా పోయింది. అందులోనూ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లాభాలు పెద్దగా రాకపోయినా.. నష్టాలను మాత్రం మూటగట్టుకోలేదు, దీంతో ప్రభాస్ నటించే సినిమాలన్నీ ఇక జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు. దీంతో ఆటోమేటిక్ గా బడ్జెట్టు పెరిగిపోతుంది. తాజాగా ఆయన నటిస్తున్న 'రాధే శ్యామ్' విషయంలోనూ అదే జరుగుతోంది.

ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల ఇటలీలో భారీ షెడ్యూల్ ముగించుకుంది. ఇటలీలో ఈ చిత్రానికి సంబంధించి  పలు కీలక సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ ముగించుకున్నట్లు చిత్రయూనిట్ వర్గాల సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరణ ఇప్పుడు హైదరాబాదులో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. హైదారబాద్లో చిత్ర క్లైమాక్స్ కి చెందిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. హాలీవుడ్ సినిమా 'గ్లాడియేటర్'కి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆస్కార్ విజేత నిక్ పావెల్ ఈ 'రాధే శ్యామ్'కి పనిచేస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్స్ వేస్తుండగా, దీనిని ఆయన పర్యవేక్షణ వహిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 30 కోట్లు ఖర్చుపెడుతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  pan India movie  Radhe Shyam  Pooja Hegde  Tollywood  Bollywood  movies  Entertainment  

Other Articles

Today on Telugu Wishesh